Upcoming Smartphones in July జులై నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
Upcoming Smartphones in July 2025 : భారత్ మార్కెట్‌లో జూన్ నెలలో అనేక స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్, వివో, రియల్‌మి, మోటోరోలా, ఐకూ, లావా, ఒప్పో, శాంసంగ్, టెక్నో, పోకో వంటి సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. జులైలోనూ అనేక హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో నథింగ్, శాంసంగ్, వివో, ఒప్పో సహా అనేక బ్రాండ్లున్నాయి.
నథింగ్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ జులై నెలలోనే విడుదల కానుంది. దీంతోపాటు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లు కూడా జులైలోనే లాంచ్ కానున్నాయి. దీంతోపాటు ఒప్పో రెనో 14 సిరీస్, వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ సహా అనేక ఫోన్‌లు వచ్చే నెలలో విడుదల కానున్నాయి.

నథింగ్ ఫోన్ 3 :
ఈ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 3) జులై 1 వ తేదీన విడుదల కానుంది. నథింగ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈవెంట్‌ను చూడవచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ మూడు 50MP కెమెరాలను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్‌ను కానుంది. ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.50 వేల ధర రేంజ్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఛార్జింగ్ సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఒప్పో రెనో 14 సిరీస్ :
జులై 3 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో రెనో 14 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 14 మరియు రెనో 14 ప్రో మోడల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ సిరీస్ ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8000 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి.
టెక్నో పోవా 7 సిరీస్ :
జులై 4 వ తేదీన టెక్నో పోవా 7 సిరీస్ విడుదల కానుంది. గ్లోబల్ మార్కెట్లో పోవా 7 అల్ట్రా 5G, పోవా 7 ప్రో 5G, పోవా 7 5G, పోవా కర్వ్ 5G, పోవా 7 వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే భారత్ మార్కెట్‌లో ఏయే ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయో తెలియాల్సి ఉంది.
భారత్ మార్కెట్‌లో టెక్నో పోవా 7 సిరీస్ భారత్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ Ella AI అసిస్టెంట్ తో విడుదల కానుంది. టెక్నో పోవా అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ చిప్‌సెట్, 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ :
జులై 8 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ ఫోన్‌లు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. నార్డ్ 5 ఫోన్ సుమారు రూ.30 వేల ధర రేంజ్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. అదే నార్డ్ CE 5 మోడల్ రూ.25 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ మరియు 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరాతో లాంచ్ కానుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే భారీ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తోపాటు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా విడుదల కానున్నాయి.
AI+ స్మార్ట్‌ఫోన్‌లు :
AI+ నుంచి పల్స్ మరియు నోవా 5G పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. జులై 8 వ తేదీన మధ్యాహ్నం 12:30PM గంటలకు లాంచ్ కానున్నాయి. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. రూ.5 వేల ప్రారంభ ధరతో ఈ రెండు ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 :
జులై 9 వ తేదీన 7:30PM IST శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్‌లు ఆవిష్కరించనుంది. దీంతోపాటు గెలాక్సీ Z ఫ్లిప్ 7 SE స్మార్ట్‌ఫోన్ కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను శాంసంగ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు. దీంతోపాటు శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
వివో X200 FE :
జులై నెలలోనే ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 6500mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 120Hz LTPO OLED డిస్‌ప్లే, Zeiss భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. రూ.50 వేల ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మోటో G96 5G :
భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ జులై నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20 వేలుగా ఉండే అవకాశం ఉంది. అదే 12GB ర్యా్మ్, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22990 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications