Smartphones in November నవంబర్ లో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్..!
భారత్ మార్కెట్‌లో అక్టోబర్ నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. నవంబర్ నెలలోనూ మరిన్ని మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల చైనాలో లాంచ్ అయిన కొన్ని ఫోన్‌లు ఈ నెలలో భారత్ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్, ఐకూ, లావా, రియల్‌మి సహా అనేక హ్యాండ్‌సెట్‌లు ఈ నెలలో విడుదల కానున్నాయి. ఈ ఫోన్‌ల విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 15 Smartphone) చైనా మార్కెట్‌లో ఇటీవలే విడుదల అయింది. అయితే ఈ హ్యాండ్‌సెట్ భారత్‌లోనూ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. ఇండియాలో ఈ ఫోన్ నవంబర్ 13 వ తేదీన విడుదల కానుంది. అదే రోజు 8PM గంటలకు వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS OxygenOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ DetailMax Engine తో వెనుక వైపు మూడు 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ చైనాలో (iQOO 15 Smartphone) ఇటీవలే విడుదల అయింది. భారత్ మార్కెట్‌లో నవంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ 6.85 అంగుళాల శాంసంగ్ M14 అమోలెడ్ 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్, Adreno 840 GPU తో అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ రూ.54999 ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో విడుదల కానున్న ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ఈ ధర కంటే ఎక్కువకే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ నవంబర్ నెలలోనే విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ రూ.25 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ ఫోన్ (Lava Agni 4 5G Smartphone) మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్, 7000mAh కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Realme GT 8 Smartphone) ఈ నెలలోనే విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్ చైనా మార్కెట్‌లో విడుదల అయింది. అక్కడ 6.79 అంగుళాల QHD+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌తో లాంచ్ అయింది.


Click it and Unblock the Notifications