Home
Mobile

Upcoming Smartphones డిసెంబర్‌లో లాంచ్‌ కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్‌, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు!

భారత్‌ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్‌ ఉంది. ఎంట్రీ లెవల్‌ హ్యాండ్‌సెట్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ల వరకు అధికంగా విక్రయాలు నమోదవుతుంటాయి. నవంబర్‌ నెలలో ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌ మరియు రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సహా అనేక ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్‌లోనూ (Upcoming Smartphones launches) అనేక హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ కానున్నాయి. ఈ జాబితాలో ప్రస్తుతానికి రియల్‌మి నోట్‌ 14 సిరీస్, ఐకూ 13, వివో X200 సిరీస్‌, రియల్‌మి నార్జో 70 సిరీస్‌ ఫోన్‌లు ఉన్నాయి.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ (iQOO 13 Smartphone) డిసెంబర్‌ 3వ తేదీన భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుంది. ఇప్పటికే భారత్‌లో ఈ చిప్‌సెట్‌తో విడుదల అయిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా రియల్‌మి GT 7 ప్రో గుర్తింపు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉంది.

Upcoming Smartphone launches in december 2024

భారత్‌లోనూ చాలా వరకు చైనా వేరియంట్‌ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఐకూ 13 ఇండియన్‌ వేరియంట్‌కు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న వివరాల ఆధారంగా ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ 2K LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS తో పనిచేస్తుంది.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మూడు 50MP కెమెరాలను అమర్చి ఉంటుంది. తాజా వివరాల ఆధారంగా ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.55,000 గా ఉండనుందని తెలుస్తోంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ధరకు లభిస్తుందని టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ తెలిపారు.

రెడ్‌మి నోట్ 14 సిరీస్‌ భారత్‌లో (Redmi Note 14 Series) డిసెంబర్ 9 న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నోట్‌ 14 5G, నోట్‌ 14 ప్రో, నోట్‌ 14 ప్రో+ హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ కానున్నాయి. నోట్‌ ప్రో ప్లస్‌ వేరియంట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ మరియు 90W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6,200mAh బ్యాటరీతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

వివో X200 సిరీస్ (Vivo X200 Series) కూడా డిసెంబర్ మధ్యలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. వివో X200, వివో X200 ప్రో స్మార్ట్‌ఫోన్‌లున్నాయి. X200 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 90W ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

అదే ప్రో మోడల్‌ 6.78 అంగుళాల క్వాడ్‌ కర్వడ్ LTPO అమోలెడ్‌ డిస్‌ప్లే, 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌, 90W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ బేస్‌ వేరియంట్ ధర సుమారుగా రూ.70,000, టాప్‌ ఎండ్‌ వేరియంట్ ధర సుమారుగా రూ.90,000 గా ఉంటుందని అంచనా.

రియల్‌మి నార్జో 70 కర్వ్‌ స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 70 Curve) డిసెంబర్‌ ఆఖరిలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ధర భారత్‌ మార్కెట్‌లో రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం ఉంది. నాలుగు స్టోరేజీ వేరియంట్‌లు, రెండు కలర్‌ వేరియంట్‌లో లభించే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Upcoming Smartphones launches in december 2024 india check list, specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X