Home
Mobile

Upcoming Smartphones ఇండియాలో ఈనెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్‌, స్పెసిఫికేషన్‌లు, ధరల వివరాలు!

భారత్‌ మార్కెట్‌లో జనవరి నెలలో వివిధ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ అయ్యాయి. వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు సహా శాంసంగ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ S25 సిరీస్‌, రియల్‌మి 14 ప్రో సిరీస్‌, పోకో X7 సిరీస్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌లు సహా అనేక హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే ఫిబ్రవరిలోనూ అనేక హ్యాండ్‌సెట్‌లు (Upcoming Smartphones) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జనవరి తరహాలోనే ఈ నెలలోనూ అనేక ప్రముఖ బ్రాండ్‌ ల స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ కానున్నాయి.

ఈ జాబితాలో ఐకూ, వివో, ఒప్పో, షియోమీ వంటి సంస్థల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ A36, A56, ఐకూ 10R, వివో V50 సిరీస్‌, ఒప్పో, టెక్నో, షియోమీ 15 అల్ట్రా Asus, ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50 సిరీస్‌లు లాంచ్‌ కానున్నాయి. అయితే ఇందులో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదల కానున్నాయి.

Upcoming Smartphones launches in india in February 2025 here is the list

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ : ఐకూ నుంచి రూ.30,000 ధర సెగ్మెంట్‌లో ఐకూ నియో 10R ఫోన్‌ (iQOO Neo 10R Smartphone లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు కెమెరా యూనిట్‌ మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుంది.

వివో V50 సిరీస్‌ : ఈ సిరీస్‌లో భాగంగా వివో V50, V50 ప్రో మోడళ్లు లాంచ్‌ కానున్నాయి. రెండు వేరియంట్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. 50MP + 50MP కెమెరాలు సహా 6000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

వివో V50 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ధర రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ (Vivo V50 Series) కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. అయితే ఈ నెల చివరలో లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ A36, A56 : ఈ రెండు మోడళ్లు ఈ నెలలోనే భారత్‌ సహా ఇతర మార్కెట్స్‌లో లాంచ్‌ కానున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల (Samsung Galaxy A36, Galaxy A56) గురించి శాంసంగ్‌ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. గెలాక్సీ A36 మరియు గెలాక్సీ A56 మోడళ్లు రూ.30 వేల నుంచి రూ.45 వేల మధ్య ధరల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50 సిరీస్‌ : ఇన్ఫినిక్స్ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఈ నెలలోనే నోట్‌ 50 సిరీస్‌ (Infinix Note 50 Smartphone) లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడి కాలేదు. అయితే భారీ బ్యాటరీ సహా మెరుగైన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రూ.15000 ధర సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

టెక్నో కర్వ్ : బడ్జెట్‌ రేంజ్‌ సెగ్మెంట్‌ కస్టమర్‌ల టార్గెట్‌గా టెక్నో కర్వ్‌ హ్యాండ్‌సెట్‌ (Tecno Curve Smartphone) లాంచ్‌ కానుందని తెలుస్తోంది. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ప్రీమియం డిజైన్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. కర్వడ్‌ స్క్రీన్‌తోపాటు మరిన్ని మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Upcoming Smartphones launches in india in February 2025 here is the list and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X