వచ్చే ఏడాది రానున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
వచ్చే ఏడాది మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. ఈ ఏాది మార్కెట్లోకి టాప్ టెన్ కంపెనీల మొబైల్స్ వచ్చినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే విజయం సాధించాయి.
వచ్చే ఏడాది మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. ఈ ఏాది మార్కెట్లోకి టాప్ టెన్ కంపెనీల మొబైల్స్ వచ్చినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కొన్ని కంపెనీల ఫోన్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. పవర్ పుల్ బ్యాటరీ అదిరిపోయే కెమెరా, అలాగే ప్రాసెసర్, ర్యామ్ వంటి వాటిల్లో దుమ్మురేపే ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఆపిల్, గూగుల్, శాంసంగ్ ఫోన్లు ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని ఓ ఊపు ఊపాయి. ఈ కంపెనీల వచ్చిన ఫోన్లు కొట్ల అమ్మకాలను రాబట్టాయి. ఈ నేపథ్యంలో 2019లో కూడా మార్కెట్లోకి కొన్ని కంపెనీల ఫోన్లు రానున్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

న్యూ ఆపిల్ ఫోన్స్
2019లో ఆపిల్ కంపెనీ సరికొత్తగా తన ఫోన్లను తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్లలో నాచ్ లెస్ డిస్ ప్లే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

శాంసంగ్
శాంసంగ్ నుంచి 2019లో గెలాక్సీ ఎస్10, ఎస్ 10 ప్లస్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. రూమర్ల ప్రకారం శాంసంగ్ ఎస్ సీరిస్ లో సరికొత్త ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కొత్త వన్ ప్లస్ ఫోన్లు
వన్ ప్లస్ కంపెనీ 2019లో సరికొత్తగా ముందుకు దూసుకురానుంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం వన్ ప్లస్ 5జీ ఫోన్ మార్కెట్లోకి రానుంది తెలుస్తోంది.

నోకియా 9
HMD Global 2018లో అనేక సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.మొత్తం మీద 12 కొత్త నోకియా ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. అదే ఊఫులో 2019లో కంపెనీ కొత్త ఫోన్ నోకియా 9ను మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

షియోమి రెడ్ మి ప్రో
48 ఎంపీ కెమెరాతో రెడ్ మి ప్రో2 మార్కెట్లోకి రాబోతోందని వార్తలు వస్తున్నాయి. కెమెరాలో కూడా అనేక మార్పులను కంపెనీ చేయనున్నట్లు తెలుస్తోంది.

గూగుల్ ఫిక్సల్ 2
గూగుల్ కంపెనీ తన నూతన లేటెస్ట్ సీరిస్ పిక్సల్ ఫోన్లను కూడా 2019లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications