భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

By Sivanjaneyulu
|

మార్కెట్లో లాంచ్ అయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీ ఫేవరెట్‌గా నిలిచిన లీ1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు ఇండియన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. లీఇకో నుంచి విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ డివైస్‌‍కు వినియోగాదారులు బ్రహ్మరథం పడుతున్నారు. రూ.10,999 ధర ట్యాగ్‌లో లభ్యమవుతోన్న ఈ సూపర్‌ఫోన్, హై-ఎండ్ స్పెక్స్‌తో వస్తోన్న పలు బ్రాండెడ్ ఫోన్‌లకు ధీటుగా నిలవటం విశేషం.

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

ఈ ఫోన్‌లో పొందుపరిచిన విప్లవాత్మక యూఎస్బీ టైప్-సీ ఛార్జర్ ద్వారా యూజర్లు అంతరాయంలేని స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించవచ్చు. టైప్-సీ ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 5 నిమిషాలు ఛార్జ్ చేసినట్లయితే 3.5 గంటల టాక్‌ టైమ్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌లో ఆఫర్ చేస్తోన్న యూఎస్బీ టైప్ సీ ఛార్జర్ ద్వారా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌నే కాదు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌ను కూడా పొందవచ్చు. లీ1ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన రివల్యూషనరీ టైప్-సీ ఛార్జర్ ద్వారా చేకూరు లాభాలను ఇప్పుడు చూద్దాం...

Read More : గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన యూఎస్బీ టైప్ సీ ఛార్జర్ వేగవంతమైన ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌ఫర్‌కు తోడ్పడుతుంది. టూ-వే పవర్ ట్రాన్స్‌ఫర్‌మరో ప్రధాన ఆకర్షణ. లీ1ఎస్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తోడవటంతో డివైస్ సామర్థ్యం మరింత రెట్టింపయ్యింది.

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

లీ1ఎస్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన యూఎస్బీ టైప్ సీ ఛార్జర్ ద్వారా డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే అవతలి డివైస్ కూడా యూఎస్బీ టైప్ సీ ఛార్జర్‌ను సపోర్ట్ చేసేదై ఉండాలి.

 

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

లీ1ఎస్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన యూఎస్బీ టైప్ సీ ఛార్జర్ రివర్సబుల్ యూసేజ్‌కు ఉపకరిస్తుంది. సాధారణ మైక్రో యూఎస్బీ కేబుల్‌లా కాకుండా యూఎస్బీ-సీ కేబుల్‌ను ఎటువైపైనా స్టిక్ చేసుకోవచ్చు.

 

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

లీ1ఎస్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన యూఎస్బీ టైప్ సీ ఛార్జర్ భవిష్యత్‌ను శాసిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. లీ1ఎస్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన యూఎస్బీ టైప్ సీ ఛార్జర్‌కు లీఇకో అదనపు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. డస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రూఫ్ ఫీచర్ టైప్ సీ ఛార్జర్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ ఛార్జర్ రెండు ఛార్జింగ్ పాత్ లను సపోర్ట్ చేస్తుంది. వాటిలో మొదటిది 24W ఛార్జర్, రెండవది 3A డేటా కేబుల్. 

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

లీ1ఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికే సొంతం చేసుకున్న యూజర్లు త్వరలోనే తమ ఫోన్‌లలో వీడియో ఆన్ డిమాండ్ అలానే టీవీ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీసులను ఆస్వాదించే అవకాశముంది. తన కంటెంట్ ఇకోసిస్టంను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో Eros ఇంకా Yupp TVలతో లీఇకో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

రూ.10,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న లీ1ఎస్ ఫోన్, ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

భవిష్యత్‌ను శాసించే ఫీచర్లతో ‘లీ1ఎస్’

ఇకో సంస్థను గతంలో ఎల్ఈటీవీ (Letv)గా పిలిచేవారు. ఈ దిగ్గజ ఇంటర్నట్ ఇంకా టెక్నాలజీ కంపెనీని నవంబర్ 2004లో Jia Yueting,Liu Hongలు ప్రారంభించారు. లీఇకో సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా ఉద్యోగులున్నారు. బీజింగ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్నలీఇకో సంస్తకు హాంకాంగ్, లాస్ యాంజిల్స్, సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కంపెనీ మూలధనం 12 బిలియన్ యూఎస్ డాలర్లు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X