USB Type-C ప్రత్యేకతలేంటి..?
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్.
ఈ మధ్య లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అనే స్పెసిఫికేషన్‌ను మనం ఎక్కువుగా వింటున్నాం. వాస్తవానికి, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు.

Read More : ఫోన్‌లో బంగారం ఎక్కడుంటుంది?, ఎలా బయటకు తీస్తారు?
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రెండు వైపులా కనెక్ట్ చేసుకునే అవకాశం..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type-C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. USB Type-C port అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డేటా సెండ్, రిసీవ్
ఈ టైప్-సీ పోర్ట్ బైడైరక్షనల్ పద్ధతిలో పవర్ అలానే డేటాను సెండ్ చేయటంతో పాటు రీసీవ్ కూడా చేసుకుంటుంది. ఈ సదుపాయంతో రెండు డివైస్‌ల మధ్య డేటా అలానే పవర్‌ను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

HDMI, VGA, Display
Type-C port కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేకమైన అడాప్టర్‌కు HDMI, VGA, Display తదితర కనెక్షన్‌లను అనుసంధానించుకుని హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను పొందవచ్చు.

ఎక్కువ కేబుల్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు
ఒక్క మాటలో చెప్పాలంటే Type-C port అందుబాటులోకి రావటం వల్ల ఇక పై ఎక్కువ కేబుల్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల కనెక్టువిటీ పనులను యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ పోర్ట్ సింపుల్ గా చక్కబెట్టేస్తుంది.

రెండు డివైస్‌లు టైప్ - సీ పోర్ట్‌లను కలిగి ఉండాలి
రెండు డివైస్‌లను USB Type-C port ఆధారంగా కనెక్ట్ చేయాలంటే కచ్చితంగా ఆ రెండు డివైస్‌లు టైప్ - సీ పోర్ట్‌లను కలిగి ఉండాలి. చైనా బ్రాండ్‌లు లాంచ్ చేస్తున్న అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లలో USB Type-C port కనిపిస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








