40-80 రూల్‌ పాటిస్తే బ్యాటరీ లైఫ్ బాగుంటుందా..?

స్మార్ట్‌ఫోన్‌తో ప్రతి నిమిషం అనేక పనులు ముడిపడి ఉండటం వల్ల, ఫోన్‌కు ఛార్జింగ్ అనేది నిత్యవసరం. ఫోన్‌ను ఛార్జింగ్ చేసే విషయంలో 40-80 రూల్‌ను పాటించటం వల్ల బ్యాటరీ మన్నిక మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచగలిగే 40-80 రూల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నికెల్ vs లిధియం

ఒకప్పుడు మొబైల్ ఫొన్‌లలో నికెల్ బ్యాటరీలను మాత్రమే వినియోగించే వారు, టెక్నాలజీ మరింతగా విస్తరించటంతో ఇప్పుడు లిధియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు అయితే ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.

లిథియం అయాన్ బ్యాటరీల విషయంలో 40-80 రూల్

నికెల్ బ్యాటరీస్ వాడే సమయంలో అందులో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోయేవరకు వాడి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టమని కంపెనీలు చెప్పేవి. కాని ఇప్పుడు వస్తున్న లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ కాలం మన్నాలంటే 40-80 రూల్ పాటించాలని కంపెనీలు చెబుతున్నాయి.

మీరు లిథియ ఐయాన్ బ్యాటరీలను వాడుతున్నట్లయితే..?

ఇప్పుడు మీ ఫోన్ ని 0-100 శాతం వరకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టడం మానేయండి. ఇలా చేస్తే ప్రతీ సారి బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.

మీరు ఏం చేయాలంటే..?

40 శాతం బ్యాటరీ మిగిలుండగానే ఛార్జింగ్ పెట్టి 80 శాతం వచ్చాక ఛార్జింగ్ తీసేయండి. ఒకవేళ ఛార్జింగ్ 40 శాతం కన్నా తక్కువగా ఉంటె కనీసం 20 శాతం ఉండేటట్టు చూసుకోండి.

ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు..?

0-20 అలాగే 80-100 వరకు ఛార్జింగ్ పెడితే లిథియం అయాన్ బ్యాటరీస్ త్వరగా దెబ్బతింటాయి. ఏళ్ల తరబడి రావాల్సిన బ్యాటరీస్ కొన్ని నెలలకే పాడయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

లిథియం అయాన్ బ్యాటరీలు ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం..?

లిథియం అయాన్ బ్యాటరీస్‌ను ఓవర్ హీట్ చేస్తే దాదాపు 35 శాతం వరకు శక్తిని కోల్పోతుందని బ్యాటరీ యూనివర్సిటీ వారు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

మీరే నిర్ణయం తీసుకోండి..?

కాబట్టి మీరు ఇక నుంచి మీరు 40-80 రూల్ పాటిస్తే మీ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

 

 

English summary
Useful Tips about Smartphone Battery life. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot