అమ్మాయిని ఆకట్టుకొవడానికి యుటివి ఆండ్రాయిడ్ ఆప్లికేషన్

Posted By: Staff

అమ్మాయిని ఆకట్టుకొవడానికి యుటివి ఆండ్రాయిడ్ ఆప్లికేషన్

ప్రస్తుతం ప్రపంచంలో రియాలిటీ టివి షోలు బాగా ఎక్కవైపోయాయి. ఎంతలా ఎక్కవైపోయాయంటే వాటి ఆధారంగా ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్ చేసేంతలాగా.. బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో యుటివి బిందాస్ కొత్తగా రియాలిటీ షో రూపొందించడం జరిగింది. దానిపేరు 'సూపర్ స్టుడ్ - స్కూల్ ఆఫ్ ఫ్లిర్ట్'. ఇటీవలే 'అష్మిత్ పటేల్' హోస్ట్‌గా ఈ షోని ప్రారంభించడం జరిగింది. ఈ షో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మహిళల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకొవడంతో పాటు అసలు మహిళను ఆకట్టుకునే వివిధ పద్దతులను ఇందులో తెలియజేయనున్నారు.

దీని కొసం ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ అప్లికేషన్ 'సూపర్ స్టుడ్ బ్లాక్ బుక్'. ఈ అప్లికేషన్‌లో ఆడవారి మనసులో చోటు సంపాదించాలంటే మగవారు ఏమి చేస్తే వారు మగవారి వసం అవుతారో లాంటి విషయాలను క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా ఆడవారితో డేటింగ్ ఎలా మొదలు పెట్టాలి లాంటివి అన్నీ కూడా స్టెప్పుల ప్రకారం ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ కుర్రాళ్ళకి ఏమి తెలియజేస్తుందంటే అమ్మాయిల్ని ఎలా పడగోట్టాలనేది నాలుగు ముఖ్యమైన స్టేజిలలో తెలియజేయడం జరిగింది. ఈ మొబైల్ అప్లికేషన్‌లో ఉన్ ఆ నాలుగు స్టేజీలు ఐస్ బ్రేకర్స్, నైట్ అవుట్, గేర్ అప్, ఛాట్ బాక్స్.

ఐస్ బ్రేకర్స్: ఈ స్టేజిలో ముఖ్యంగా మగవారికి ఏదైనా శుభ సందర్బం వచ్చినప్పుడు ఎలాంటి మాటలు చెబితే మన వసం అవుతారో తెలియజేయడం జరుగుతుంది.

నైట్ అవుట్: మీరు ప్రేమించిన అమ్మాయిని అందమైన నైట్ అవుట్‌కి తీసుకొని వెళదామని ప్లాన్ చేశారు. కానీ మీకు నైట్ అవుట్ గురించిన కూల్ ప్రదేశాలు తెలియకపోవచ్చు. అటువంటి సందర్బంలో మీ సిటీలో ఏ ప్లేసులో ఐతే ఖచ్చితమైన డేట్ చేస్తే బాగుంటుందో మీకు సలహా ఇస్తుంది.

గేర్ అప్: మీ ప్రేయసికి అర్జెంటుగా చాక్లెట్లు, ప్లవర్స్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాలని అనుకుంటున్నారు. కానీ అవి ఎక్కడ లభిస్తాయో మీకు తెలియక పోవచ్చు. వీటికి సంబంధించిన సరైన సమాచారన్ని ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు.

ఛాట్ బాక్స్: మీరు ప్రేయసితో డేట్ వెళ్లేందుకు సరైన సమయం కేటాయించలేక పోతున్నారా.. ఇలాంటి సందర్బాలలో ప్రేయసిని అందమైన సంభాషణలతో సంతృప్తి పరచండి. ఇలా మీ అందమైన ప్రేయసికి అందమైన గిప్టులు, ప్లవర్స్‌తో ఆశ్చర్యాన్ని కలగజేసి మీ వశం చేసుకొండి.

సూపర్‌స్డుడ్ బ్లాక్ బుక్ అప్లేకేషన్‌ని ఓఎమ్‌ఎల్ వారు సృష్టించడం జరిగింది. ఐఫోన్ డివైజెస్‌ వాడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ దీనిని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొవచ్చు. దీనికి గాను మీరు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి వెళ్లి యుటివి బిందాస్ సూపర్ స్టుడ్ అని సెర్చ్ చేయాలి. లేదా ఈ క్రింద ఇచ్చిన లింక్ సహాయంతో కూడా డౌన్ లోడ్ చేసుకొవచ్చు.

Android URL: https://market.android.com/details?id=com.foolsmart.superstud or bit.ly/ojOwYi

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot