2016.. ఈ 10 ఫోన్‌లదే!

స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో వినియోగదారులు అనేక విషయాలను పరిగిణలోకి తీసుకోవల్సి ఉంటుంది. డిస్‌ప్లే, ర్యామ్, స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ, కనెక్టువిటీ తదితర అంశాల పట్ల యూజర్ నిర్థిష్టమైన అవగాహనను కలిగి ఉండాలి.

2016.. ఈ 10  ఫోన్‌లదే!

Read More : మీ ఫోన్‌లో వైరస్ ఉందా? తీసేయటం ఎలా..?

ఈ ఏడాదికి గాను అనేక మోడల్స్‌లో స్మార్ట్‌‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయినప్పటికి అనూహ్యంగా కొన్ని మాత్రమే విజయాన్ని సాధించాయి. 2016కుగాను ఇండియన్ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్ల్ లాంచ్ కాబడి సక్సెస్‌ను అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3

షియోమీ నుంచి 2016లో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3 ఫోన్ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ హోదాను సొంతం చేసుకుంది. ఈ ఫోన్ కోసం గూగుల్‌లో అత్యధిక మంది శోధించటం జరిగింది. అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు ధర పరంగా రెడ్మీ నోట్ 3 ఫోన్ మంచి మార్కులను కొట్టేసింది.

 

Moto G4 Plus

మోటో జీ4 ప్లస్

బ్రాండ్ వాల్యూ, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్, హైక్వాలిటీ స్పెసిఫికేషన్స్ వంటి అంశాలు మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు మంచి రేటింగ్స్‌ను అందించాయి.

 

Samsung Galaxy J5

సామ్‌సంగ్ గెలాక్సీ జే5

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ జే సిరీస్ నుంచి లాంచ్ అయిన గెలాక్సీ జే5 ఫోన్‌కు 4జీ కనెక్టువిటీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సపోర్ట్ వంటి అంశాలు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ మిడ్ రేంజర్ స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Oppo F1s

ఒప్పో ఎఫ్1ఎస్

ఏకంగా 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మార్కెట్లో లాంచ్ అయిన Oppo F1s స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో సరికొత్త శకానికి నాందిగా నిలిచింది.

 

Xiaomi Redmi 3S Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్

శక్తివంతమైన ఆక్టా కోర్ ప్రాసెసర్ తో షియోమీ నుంచి మార్కెట్లో లాంచ్ అయిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ ఫోన్ Redmi 3S Prime మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. రూ.9,000 ధర పరిధిలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అత్యాధునికి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

 

Coolpad Note 3 Lite

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

ఈ ఏడాది కూల్‌ప్యాడ్ నుంచి లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Note 3 Lite, పేరుకు తగట్టుగానే ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్ వర్గాలను ఆకట్టుకుంది.

 

Lenovo K5 Note

లెనోవో కే5 నోట్

2016కు గాను గూగుల్ అత్యధికంగా శోధించబడిన ఫోన్‌ల జాబితాలో లెనోవో కే5 నోట్ ప్రముఖ స్థానంలో నిలిచింది. మెరుగైన 4జీ కనెక్టువిటీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ వంటి అంశాలు ఈ ఫోన్‌ను నెం.1గా నిలబెట్టాయి.

 

Vivo V5

వివో వీ5

ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మార్కెట్లో లాంచ్ అయిన Vivo V5 స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో సరికొత్త శకానికి నాందిగా నిలిచింది. ఈ ఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

 

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్

లెనోవో నుంచి కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ బస్టర్ ఫోన్ K6 Power ఏకంగా 4000mAh బ్యాటరీతో అదరగొడుతోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Value for Money Smartphones Launched in 2016. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot