Home
Mobile

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లతో విసిగిపోయారా? ఇదుగోండి Palm

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లతో విసుగెత్తిపోయారా? అయితే ఈ చిన్న స్మార్ట్‌ఫోన్ మీ కోసమే.

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లతో విసుగెత్తిపోయారా? అయితే ఈ చిన్న స్మార్ట్‌ఫోన్ మీ కోసమే. యూఎస్‌కు చెందిన ప్రముఖ నెట్‌వర్క్ క్యారియర్ వెరిజోన్, Palm పేరిట ఓ క్రెడిట్‌కార్డ్ సైజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ స్మార్ట్‌వాచ్‌తో పోలిస్తే కంఫర్టబుల్ గానూ, రెగ్యులర్ మొబైల్ ఫోన్‌తో పోలిస్తే కాంపాక్ట్‌గాను అనిపిస్తుంది. మార్కెట్లో ఈ బుల్లి స్మార్ట్‌ఫోన్ ధరను 349 డాలర్లుగా కంపెనీ ఫిక్స్ చేసింది.

ఆన్ ద గో యాక్టివిటీస్‌ నిమిత్తం..

ఆన్ ద గో యాక్టివిటీస్‌ నిమిత్తం..

3.3 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ బరువు 62.5 గ్రాములుగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ను ప్రైమరీ ఫోన్‌‌గా ఉపయోగంచుకోవటం కుదరదు. కేవలం ఎగ్జిస్టింగ్ వెరిజోన్ వైర్‌లెస్ అకౌంట్‌లతో మాత్రమే ఈ ఫోన్‌లను లింక్ చేసుకునే వీలుంటుంది. ఈ చిన్ని స్మార్ట్‌ఫోన్‌‌ను సామ్‌సంగ్ మాజీ డిజైన్ ఎగ్జిక్యూటివ్స్ అయిన డెన్నిస్ మిలోసోస్కీ ఇంకా హోవార్డ్ నుక్‌లు అభివృద్థి చేసారు. వీకెండ్‌లో ఆన్ ద గో యాక్టివిటీస్‌కు ఈ ఫోన్ చాలా ఉపయోగపడుతుందని వీరు చెబుతున్నారు.

యాప్ నోటిఫికేషన్‌లను టర్నాఫ్ చేసేసుకోవచ్చు..

యాప్ నోటిఫికేషన్‌లను టర్నాఫ్ చేసేసుకోవచ్చు..

క్విక్ యాక్సిస్ నిమత్తం డిజైన్ చేయబడిన ఈ డివైస్‌లో మ్యూజిక్ ఇంకా టెక్స్టింగ్‌ను వేగవంతంగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఫోన్‌లోని లైఫ్ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా అన్ని యాప్ నోటిఫికేషన్‌లను టర్నాఫ్ చేసేసుకోవచ్చు.

 

 

ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..

ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..

3.3 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే విత్ 445 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై ఇంకా బ్లుటూత్ కనెక్టువిటీ.

 

 

టైటానియమ్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్స్..

టైటానియమ్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్స్..

అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్స్ ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వెరిజోన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు సంవత్సరాల కాంట్రాక్ట్‌తో విక్రయించబోతోంది. టైటానియమ్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

 

 

Best Mobiles in India

English summary
Verizon Launches Palm, a Credit Card-Size Phone, With an Assist From Stephen Curry.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X