అమ్మో... ఈ ఫోన్ ధర అక్షరాలా రూ.6,70,000

బ్రిటీష్ కంపెనీ వెర్టూ (Vertu) ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయటంలో దిట్ట. ఈ కంపెనీ తయారు చేసే స్మార్ట్‌ఫోన్ ఖరీదు మీ మొదటి కారు ధరకన్నా ఎక్కువుగా ఉంటుంది. తాజాగా, ఈ కంపెనీ రూపకల్పన చేసిన సరికొత్త మోడల్ ఫోన్ సిగ్నేచర్ టచ్ (Signature Touch). ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర 11,300 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.6,70,372). ఒక్కో ఫోన్‌ను ఒక్కో నిపుణుడు తయారుచేస్తాడు.
నాయిస్ క్యాన్సిలేషన్, వర్చువల్ సరౌండ్ సౌండ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. 64గిగాబైట్ల స్టోరేజ్ సామర్థ్యం , ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 13 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 5.7 అంగుళాల తాకేతెర. వెర్టూ కంపెనీ 1998లో నోకియా కంపెనీలో ఓ భాగంగా ప్రారంభమైంది. పలు కారణాల రిత్యా వెర్టూ కంపెనీ 2012 అక్టోబర్ లో నోకియా నుంచి వేరుబడి సొంతంగా లగ్జరీ ఫోన్ లను తయారు చేయటం ప్రారంభించింది. వెర్టూ కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన ఫోన్ పేరు వెర్టూ టీఐ ( Vertu Ti), దీని ధర 10,569 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.6,27000).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








