సామ్‌సంగ్ నుంచి ఇన్‌డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఫోన్..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సామ్‌సంగ్ మరో విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సామ్‌సంగ్ మరో విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. నాట్చ్ డిస్‌ప్లే ట్రెండ్‌కు చెక్ పెడుతూ ఇన్‌డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ అభివృద్థి చేస్తున్నట్లు సమచారం. GSMArena రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం చైనాలోని షెంజన్ వేదికగా '2018 OLED Forum' పేరుతో ఓ ప్రెస్ కాన్ఫిరెన్సును సామ్‌సంగ్ నిర్వహించబోతోంది.

ఫ్లిప్‌కార్ట్ 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్ లో దుమ్మురేపబోతోన్న ఆఫర్స్ ఇవే !ఫ్లిప్‌కార్ట్ 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్ లో దుమ్మురేపబోతోన్న ఆఫర్స్ ఇవే !

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే క్రిందే అన్నీ..

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే క్రిందే అన్నీ..

ఈ సమావేశంలో భాగంగా తాను అభివృద్థి చేస్తోన్న యూపీఎస్ టెక్నాలజీ గురించి పలు కీలక వివరాలను సామ్‌సంగ్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. యూపీఎస్ టెక్నాలజీలో భాగంగా ఫోన్ ప్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు ఇతర సెన్సార్లను స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే క్రింద ఇంటిగ్రేట్ చేస్తారు. ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్న నాట్చ్ డిజైన్ ఇంకా మెకానికల్ స్లైడర్‌‌లు పూర్తిగా కనమరుగయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త టెక్నాలజీని వచ్చే ఏడాది లాంచ్ చేయబోయే గెలాక్సీ ఎస్10 లేదా ఇతర స్మార్ట్‌ఫోన్స్ ద్వారా సామ్‌సంగ్ పరిచయం చేసే అవకాశముంది.

 

 

త్వరలో అన్ని ఫోన్‌లకు వైర్‌లెస్ ఛార్జింగ్...

త్వరలో అన్ని ఫోన్‌లకు వైర్‌లెస్ ఛార్జింగ్...

ఇప్పటి వరకు హైఎండ్‌ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైన సామ్‌సంగ్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ త్వరలో అన్ని సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి రాబోతోందట. బడ్జెట్‌తో సంబంధం లేకుండా తాను లాంచ్ చేసే అన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన సాంకేతికతను సామ్‌సంగ్ అభివృద్థి చేస్తున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

లో-కాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌తో మార్కెట్లోకి..
 

లో-కాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌తో మార్కెట్లోకి..

దక్షిణ కొరియా నుంచి వెలువడిన ఓ రిపోర్ట్ ప్రకారం సామ్‌సంగ్ మరికొద్ది రోజుల్లో లో-కాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ ఛార్జర్ ధర 20 డాలర్ల‌లోపు ఉండొచ్చని సమాచారం. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ అలానే జే సిరీస్‌ల నుంచి త్వరలో లాంచ్ అయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్ చేయబోతోందట.

 

 

టాబ్లెట్ పీసీల కోసం ఓవర్ ద ఎయిర్ ఎయిర్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ...

టాబ్లెట్ పీసీల కోసం ఓవర్ ద ఎయిర్ ఎయిర్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ...

సామ్‌సంగ్ తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్స్ అలానే టాబ్లెట్ పీసీల కోసం ఓవర్ ద ఎయిర్ (ఓటీఏ) వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గతంలోనూ వార్తలొచ్చాయి. ఈ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ డాక్యుమెంటేషన్‌ను వరల్డ్ ఇంటలెక్ట్యుల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ) అప్పట్లో రిలీజ్ చేసింది. సామ్‌సంగ్ నుంచి ఓ కొత్త టెక్నాలజీని భవిష్యత్‌లో చూడబోతున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో పోలిస్తే సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోన్న టెక్నాలజీ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతోందట.

Best Mobiles in India

English summary
VERY SOON SAMSUNG PHONES COULD BE COMING WITH AN IN-DISPLAY FRONT FACING CAMERA.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X