ఇక నుంచి వైబర్‌లోనూ చాట్ చేసుకోవచ్చు

Posted By:

ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఐపీ అప్లికేషన్ వైబర్ (Viber) తమ యాప్‌కు సంబంధించి ప్రముఖ అప్‌డేట్‌ను ప్రకటించింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా తమ వైబర్ యాప్ ద్వారా ఉచిత మెసేజింగ్ అలానే హైడెఫినిషన్ క్వాలిటీ వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చని కంపెనీ తెలిపింది. అదనంగా జత చేసిన మరో కొత్త ఫీచర్ ‘పబ్లిక్ చాట్స్' ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కమ్యూనిటీలు అలానే సెలబ్రెటీలతో చాట్ చేసుకోవచ్చు.

 ఇక నుంచి వైబర్‌లోనూ చాట్ చేసుకోవచ్చు

భారత్‌లో తాము 56 మంది సెలబ్రెటీ చాట్ భాగస్వాములతో ఈ యాప్‌ను ఆవిష్కరిస్తున్నామని అనుభవ్ నయ్యర్ (వైబర్, కంట్రీ హెడ్ ఆఫ్ ఇండియా) తెలిపారు. వీరిలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూపర్, సచిన్ తెందుల్కర్, రోహిత్ శర్మ, సైనా నెహ్వాల్‌లు ఉన్నారు.

ఈ ఏడాది చవరినాటికి తమ యూజర్ల సంఖ్య 50 కోట్లకు దాటుతుందని వైబర్ అంచనా వేస్తోంది. భారత్, అమెరికా, రష్యాల్లో వైబర్‌కు అత్యధిక మంది వినియోగదారులు ఉన్నట్లు వైబర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీరసర్ మార్క్ హార్డీ చెప్పారు. భారత్‌లో తమకు 3.3 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, అంతర్జాతీయంగా 46 కోట్ల మంది ఉన్నారని ఆయన తెలిపారు. తమకు ఆదాయం వచ్చే అగ్రశ్రేణి ఐదు మార్కెట్లలో భారత్ ఒకటని వివరించారు. భారత్‌లో తమ యాప్ వినియోగాన్ని మరింత విస్తరింపజేసే క్రమంలో గేమ్స్‌తో పాటు మరింత స్థానిక కంటెంట్‌ను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు హార్డీ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Viber announces public chats, HD voice calls and free messaging. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot