జేబులోనే పేలిపోయిన మొబైల్, అంతా క్షణాల్లోనే, షాకింగ్ వీడియో ఇదే !

|

ఈ మధ్య మొబైల్స్ చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏకంగా జేబుల్లోనే పేలిపోతున్నాయి. తాజాగా ముంబైల్ జరిగిన ఘటన ఇప్పుడు మొబైల్ వాడకాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే.. ఓ రెస్టారెంట్ లో కూర్చుని తింటున్న వ్యక్తి జేబులోని స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది, బాంబు పేలిందేమో అనుకుని మిగతా కస్టమర్లంతా తీవ్ర భయాందోళనలతో పరుగులు పెట్టారు. ముంబైలోని బంధూప్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈనెల 4వ తేదీన ఘటన జరిగినట్టు తెలుస్తుండగా, షర్ట్ జేబులో పెట్టుకున్న ఫోన్ పేలి, రెస్టారెంట్ అంతా పొగలు వ్యాపించాయి. కాగా అతనికి స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్పించారని తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్ ఏ కంపెనీది అన్న వివరాలు ఇంకా తెలియదు.

 

ఈ 10 కీబోర్డ్ షార్ట్ కట్స్ మీకు తెలుసో లేదో చెక్ చేయండిఈ 10 కీబోర్డ్ షార్ట్ కట్స్ మీకు తెలుసో లేదో చెక్ చేయండి

వీడియో ఇదే..

గడచిన మార్చిలో ఒడిశాలోని ఓ టీనేజర్ తన బంధువుతో ఫోన్ మాట్లాడుతూ చార్జింగ్ పెట్టగా, అది పేలిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ముంబై రెస్టారెంట్ లో జరిగిన ఘటన వీడియోను మీరూ చూడవచ్చు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఘటన

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఘటన

ఇదివరకే ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన కిరణ్ సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్పై తన దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి.మంటలు గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్‌మి నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్‌ తెలిపారు.

మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ..? ( సింపుల్ టిక్స్ )
 

మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ..? ( సింపుల్ టిక్స్ )

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం..ఓ లుక్కేయండి.

96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా..
ఎప్పుడైనా ఛార్జింగ్ 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. అలాగే మొబైల్‌కి పౌచ్ ఉంటే తీసేసి ఛార్జింగ్ పెట్టాలి.

ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే..

ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే..

మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే 5 లేదా 10 నిమిషాల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్‌ చేసి చల్లబడ్డాక ఆన్ చేయాలి.

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు..

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు..

మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, హాట్ స్పాట్, సాంగ్స్, నెట్, కాల్స్, గేమ్స్ పొరపాటున కూడా వాడకూడదు. మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే వీడియో కాల్, హెవీ గేమ్స్ ఆడకూడదు. ఛార్జింగ్ అయిన తరువాత మొబైల్ హీట్ అయితే 5 నిమిషాల వరకు మొబైల్‌ని పట్టుకోకూడదు.

అవసరం లేని అప్లికేషన్స్ ..

అవసరం లేని అప్లికేషన్స్ ..

మీకు అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే మొబైల్ ఫోన్స్ నుంచి తీసెయ్యాలి. కొన్ని గేమ్స్, అప్లికేషన్స్ వల్ల మొబైల్ విపరీతంగా హీట్‌ అవుతుంది. వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసెయ్యాలి.

100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను..

100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను..

మొబైల్‌కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్‌ని కొనుక్కుని వాడాలి. 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను వాడకూడదు. మీ మొబైల్ బ్యాటరీ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరి తీసుకొని మార్చాలి.

ప్యాంట్ జేబులో..

ప్యాంట్ జేబులో..

ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోకూడదు. మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్‌లో మొబైల్‌ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఉంది.

ఛార్జింగ్ పెట్టి..

ఛార్జింగ్ పెట్టి..

కొంతమంది ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్‌లో సాంగ్స్ వింటుంటారు. అలా చేయడం వల్ల చాలా రిస్క్. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పటికే కొంతమంది చనిపోయారు.

Best Mobiles in India

English summary
Video: Man's mobile phone explodes in his pocket in Mumbai More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X