మార్కెట్లోకి వీడియోకాన్ ఫోన్‌లు,ఫీచర్లేంటి..?

Posted By: Super

 మార్కెట్లోకి వీడియోకాన్ ఫోన్‌లు,ఫీచర్లేంటి..?

 

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీబ్రాండ్ వీడియోకాన్ రెండు ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తెచ్చింది. వీడియోకాన్  ఏ20, వీడియోకాన్ ఏ30 మోడళ్లలో  తయారు కాబడిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు దేశంలోని ప్రముఖ రిటైల్ మార్కెట్లలో  లభ్యంకానున్నాయి. ఫీచర్లు ఇతర వివరాలను పరిశీలిద్దాం........

టాప్-10 డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్(జీఎస్ఎమ్+ సీడీఎమ్ఏ)!

వీడియోకాన్ ఏ20 (Videocon A20):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్  320 x 480పిక్సల్స్, 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, 1350ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.4,999.

వీడియోకాన్ ఏ30 (Videocon A30):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, 1గిగాహెట్జ్  డ్యూయల్‌కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,  వై-ఫై, బ్లూటూత్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.7,999.

(ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసిన ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్‌బుక్, టీవోఐ, ఈటీ, హిస్టరీ యరేజర్, గెస్ట్యర్ సెర్చ్, గూగుల్ అప్లికేషన్స్.)

ల్యాప్‌టాప్‌లు..రూ.25,000 ధరల్లో

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot