వీడియోకాన్ నుంచి 1జీబి ర్యామ్ ఫోన్ కేవలం రూ.4,999కే

Posted By:

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ వీడియోకాన్ ‘ఇన్ఫీనియమ్ జెడ్45 నోవా' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.4,999. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ చౌక ధర ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 1జీబి ర్యామ్ ఫోన్ కేవలం రూ.4,999కే

వీడియోకాన్ ఇన్ఫీనియమ్ జెడ్45 నోవా స్పెసిఫికేషన్లు

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్ వంటి ప్రత్యేకతలతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Videocon Infinium Z45 Nova with 1GB RAM, Quad Core Launched at Rs 4,999. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot