రూ.1950కే వీడియోకాన్ కొత్త మొబైల్ ఫోన్

వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ డివిజన్ బుధవారం ‘వీఫోన్ గ్రాండీ’ (VPhone Grande) పేరుతో సరికొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. అంతర్జాతీయ శ్రేణిలో రూపకల్పన చేయబడిన ఈ ఎంట్రీ స్థాయి మొబైల్ హ్యాండ్‌సెట్ ధర రూ.1950. 2.8 అంగుళాల QVGA క్వాలిటీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అమర్చారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫోన్‌లో ఏర్పాటు చేసిన పెద్ద ఆన్-స్ర్కీన్ ఫాంట్‌లు పెద్దవారికి మరింత సౌకర్యవంతమైన మొబైలింగ్‌ను చేరువచేస్తాయి. గ్రామీణస్థాయి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేయబడిన ఈ ఫోన్ 6 ప్రాంతీభాషలను సపోర్ట్ చేస్తుంది. 1.3 మెగా పిక్సల్ సామర్థ్యం గల కెమెరా వ్యవస్థను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. ఏర్పాటు చేసిన 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫోన్‌కు శక్తిని సమకూరుస్తుంది. మూవీ జూక్‌బాక్స్, సెక్యూరిటీ ఇన్‌బాక్స్, స్మార్ట్‌ఆటో కాల్ రికార్డింగ్, స్మార్ట్‌కాల్ డైవర్ట్ తదితర ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసారు.


Click it and Unblock the Notifications








