2జీ ధరలకే 4జీ ఇంటర్నెట్ సర్వీసులు: వీడియోకాన్
భారత్‌లో 4జీ నెట్‌వర్క్ సర్వీసులను అందించేందుకు పలువురు టెలికామ్ ఆపరేటర్లు ముమ్మర ప్రయాత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లలో ఒకటైన వీడియోకాన్ టెలికామ్, ఎల్టీఈ ఇండియా కార్యక్రమంలో స్పందిస్తూ తాము త్వరలో 4జీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను 2జీ ఇంకా 3జీ ధరల్లోనే ఆఫర్ చేస్తామని వెల్లడించింది.

దేశంలోని అత్యధకిక సర్కిళ్లలో కేవలం ఎయిర్ టెల్ మాత్రమే 4జీ సేవలను అందిస్తున్న నేపధ్యంలో వీడియోకాన్ టెలికామ్ తీసుకున్న తాజా నిర్ణయం లబ్ధి చేకూర్చేదిగా ఉంది. దేశయంగా వీడియోకాన్ టెలికామ్‌కు 7 సర్వీసు ఏరియాలలో లైసెన్స్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 4 సర్కిళ్లలో మాత్రమే సంస్థ ఆపరేషన్‌లను నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 10 నగరాల్లో 4జీ సర్వీసులను అందుబాటులోకి తీసకువస్తామని వీడియోకాన్ టెలికామ్ సంచాలకులు ఇంకా సీఈఓ అరవింద్ బాలీ తెలిపారు.
సామ్‌సంగ్.. హెచ్‌టీసీ.. నోకియా వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ముచ్చెటమలు పట్టిస్తున్న దేశవాళీ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌కు సంబంధించి మరో పిడుగులాంటి వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. తాజా వ్యూహరచనలో భాగంగా మైక్రోమాక్స్ తన మొట్టమొదటి 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అతిత్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు @LeaksterInc ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడైంది. భారీ అంచనాలతో జాన్‌లో విడుదలకాబోతున్న మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనధికారికంగా వెల్లడైన పలు స్పెసిఫికేషన్‌ల వివరాలను గిజ్‌బాట్ మీకు ప్రత్యేకంగా అందిస్తోంది.
4జీ కనెక్టువిటీ, సింగిల్ సిమ్ సపోర్ట్, ఎన్-విడియా టెగ్రా 4ఐ ప్రాసెసర్, 4.7 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








