ఎంట్రీ కేకపుట్టిస్తుంది...!!

Posted By: Staff

ఎంట్రీ కేకపుట్టిస్తుంది...!!

ప్రపంచపు తొలి 3జీ ఆధారిత డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌కు వారసునిగా వ్యూఫోన్ 3 మార్కెట్లో విడుదలైంది. వ్యూసోనిక్ కార్పొరేషన్ సంస్దచే రూపొందించబడిన ఈ హ్యాండ్‌సెట్‌ను తొలిగా ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రకటించారు.


ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ 3డి స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి వేగవంతమైన వెబ్‌బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది.

వినియోగదారుల అవసరాలను తీర్చటంలో వ్యూఫోన్ 3 ఉత్తమంగా సహకరిస్తుంది. వ్యాపార లావాదేవీల నిమిత్తం అనేక ప్రాంతాల్లో సంచరించే వ్యాపారవేత్తలకు ఈ డ్యూయల్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్ ఫోన్ పూర్తిగా ఉపయోగపడుతుంది. 3జీ నెట్‌వర్క్ సౌలభ్యతతో మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ అవసరాలను త్వరితగతిన తీర్చుకోవచ్చు.

వ్యూఫోన్ 3 ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,


3.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్320 x 480పిక్సల్స్),


800మెగాహెడ్జ్ ప్రాసెసర్,


మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీ 32జీబి పొడిగించుకోవచ్చు,


వ్యూసీన్ 3డీ టెక్నాలజీ,


ఉత్తమమైన గ్రాఫిక్ వ్యవస్థ.

మొబైలింగ్‌కు అవసరమైన పూర్తి స్థాయి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఈ హ్యాండ్‌సెట్‌లో అమర్చారు. ఈ ఫోన్ కొనుగోలు ద్వారా యూజర్ పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించవచ్చు. సుసంపన్నమైన ఫీచర్లతో డిజైన్ కాబడిన వ్యూఫోన్ 3, రిలయన్స్ డిజిటల్  అవుట్ లెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. ధర రూ.9,990.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot