ముందు అమెరికా.. తర్వాత ఇండియా..?

Posted By: Prashanth

ముందు అమెరికా.. తర్వాత ఇండియా..?

 

వచ్చే వారం లాస్‌వేగాస్‌లో నిర్వహించనున్న ‘కన్స్యూమార్ ఎలక్ట్రానిక్ షో’లో ప్రతిభను చాటుకునేందుకు ఆసియా దేశాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఉత్సకతతో ఉన్నాయి. ఈ సంస్థల్లో ఒకటైన వ్యూసోనిక్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఈ వేదిక పై ప్రదర్శించి స్మార్ట్‌పోన్ రంగంలో అరంగ్రేటం చేయనుంది.

‘వ్యూసోనిక్ 3’గా వస్తున్న ఈ స్మార్ట్‌ మొబైల్‌ను తొలత లాటిన్ అమెరికాలో మార్చిలో విడుదల చేస్తారు. ఆ తర్వాత ఇండియా తదితర దేశాల్లో విడుదల చేస్తారు. ఎల్‌సీడి మానిటర్స్, డిస్‌ప్లేలను తయారుచేయటంలో పైనీర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యూసోనిక్ ఈ తాజా ఎంట్రీతో మరో మైలురాయిని అధిగమించనుందన్న ప్రచారం జోరందుకుంది.

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ రన్ అవుతుంది. 800 MHz సామర్ధ్యం గల క్వాల్కమ్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 512జీబి ర్యామ్, 3జీ వ్యవస్థను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot