వచ్చే వారంలో మార్కెట్లోకి వివ్‌సోనిక్ మొబైల్ ఫోన్స్

Posted By: Super

వచ్చే వారంలో మార్కెట్లోకి వివ్‌సోనిక్ మొబైల్ ఫోన్స్

ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ది చెందుతున్న బిజినెస్ మార్కెట్లలలో ఇండియన్ మొబైల్ మార్కెట్ ఒకటి. ఇది ఎంతలా అభివృద్ది చెందింది అంటే ఎలక్ట్రానిక్ డివైజ్ తయారీ దారులు తమ ఫ్లాట్ ఫామ్‌తో పాటు మొబైల్ మార్కెట్లోకి వచ్చే విధంగా. 2015వ సంవత్సరం కల్లా ఇండియన్ మొబైల్ మార్కెట్ మూడంకెల వృద్ది రేటుని సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియన్ మొబైల్ సెగ్మెంట్‌లోకి టెలివిజన్ సెట్స్, కంప్యూటర్స్, కంప్యూటర్ ఉత్పత్తులు తయారు చేసేటటువంటి ఇంటెక్స్, వీడియోకాన్ ఇప్పటికే మొబైల్ రంగంలో ప్రవేశించాయి. ఇవి ప్రవేశించడమే కాకుండా అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలను నమోదు చేయడంతో మిగిలిన కంపెనీలు కూడా మొబైల్ రంగంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమనం చేసుకుంటున్నాయి. అలా మొబైల్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న మరో కొత్త కంప్యూటర్ల తయారీదారు వివ్‌సోనిక్ .

వివరాలలోకి వెళితే వివ్‌సోనిక్ కంపెనీ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రెండు కొత్త టాబ్లెట్స్‌ని విడుదల చేయనుందని సమాచారం. ఆ రెండు మోడల్స్ వివ్‌సోనిక్ వి350, వివి సోనిక్ వివ్‌ప్యాడ్ 4. వివ్‌సోనిక్ వి350 ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ కస్టమర్స్‌కి 3డి ఇంటర్ ఫేస్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. ఇక వివ్‌సోనిక్ వివ్‌ప్యాడ్ 4 మాత్రం 4.1 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగినటువంటి ఫోన్. వివ్‌ప్యాడ్ 4తో పోల్చినట్లైతే వి350 3.5 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని మాత్రమే కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్పైస్ ఎమ్ఐ 270 తర్వాత ఇండియాలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి డ్యూయల్ సిమ్ పోన్ వి350 కావడం విశేషం.

వి350 డ్యూయల్ సిమ్‌తో పాటు మల్టిబుల్ నెట్ వర్క్స్‌ని ఒకే సమయంలో సపోర్ట్ చేస్తుంది. రెండు మొబైల్స్ కూడా మల్టీమీడియో, కనెక్టివిటీ పీచర్స్‌లలో కూడా కస్టమర్స్‌కి ఎటువంటి నిరాశను కలిగించవు. వి350 మొబైల్ 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగిఉండి హైడెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని అందిస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఇక వీటి ఖరీదు విషయానికి వస్తే వి350 మాత్రం సుమారుగా రూ 17,000గా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ మొబైల్ ఈ నెల చివరి నుండి రిలయన్స్ డిజిటల్ అవుట్ లెట్స్‌లలో దర్శనమివ్వనున్నాయి. ఇక వివ్ ప్యాడ్ 4 ధర మాత్రం ఇంకా వెల్లిడంచలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot