మార్కెట్లోకి వివ్ సోనిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్ వి430..

Posted By: Super

మార్కెట్లోకి వివ్ సోనిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్ వి430..

ఇప్పటివరకు ఇండియన్ మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ అంటే కేవలం శ్యామ్‌సంగ్, నోకియా, ఎల్‌జీ లాంటి కంపెనీల మొబైల్స్‌నే వినడం జరిగింది. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్ విభాగంలోకి మరో కొత్త మొబైల్ తయారీదారు లిస్ట్‌లో చేరనుంది. ఆ కంపెనీ ఏంటని అనుకుంటున్నారా.. డెస్క్‌టాప్ లకు, ల్యాప్‌టాప్‌లకు సుప్రసిద్దమైన వివ్ సోనిక్. వివ్‌సోనిక్ కంపెనీకి ఉన్న మొబైల్ కస్టమర్స్ హై ఎండ్ కస్టమర్స్. వారిని దృష్టిలో పెట్టుకోని వివ్‌సోనిక్ త్వరలో ఇండియాలో హై ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

దాని పేరు వివ్‌సోనిక్ వి430. వివ్‌సోనిక్ వి430 స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫీచర్స్‌ని గనుక ఒక్కసారి పరిశీలించినట్లైతే ఫెర్పామెన్స్ అదిరిపోయే విధంగా ఉండడం కోసం 1 GHz స్పీడ్ కలిగిన Qualcomm Snapdragon సింగిల్ కోర్ ప్రాసెసర్‌ని ఈ మొబైల్‌లో నిక్షిప్తం చేయడం జరిగింది. ఎటువంటి అప్లికేషన్‌నైనా త్వరగా రన్ చేసేందుకు గాను ఇందులో 512 MB of RAM ఇమడింపజేయడం జరిగింది. ఇకపోతే వివ్‌సోనిక్ వి430 మొబైల్ ఫోన్ యూజర్స్‌కు వేలకొద్ది అప్లికేషన్స్‌ని అందుబాటులోకి అందుబాటులో ఉంచుతుంది.

అందుకు కారణం వివ్‌సోనిక్ వి430 స్మార్ట్ ఫోన్ గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ వి2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవ్వడమే. వివ్‌సోనిక్ వి430 స్మార్ట్ పోన్ డిస్ ప్లే విషయానికి వస్తే 4.3 ఇంచ్ డిస్ ప్లే, WVGA మల్టీ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉండడంతో పాటు, 800 x 480 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చుకొవచ్చు.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే v2.1 A2DP బ్లూటూత్‌ని సపోర్ట్ చేయడంతో పాటు, జిపిఎస్ ఫీచర్, హై స్పీడ్ 802.11 b/g/n WiFiని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న వివ్‌సోనిక్ వి430 స్మార్ట్ ఫోన్ మొబైల్‌కి చెందిన పూర్తి సమాచారం త్వరలో.. ఇకపోతే దీని ధరను ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు. వివ్‌సోనిక్ వి430 మరింత సమాచారం కోసం వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot