నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ఊహించనంత డిస్కౌంట్.. 1.5K డిస్‌ప్లే, 7 సంవత్సరాల అప్‌డేట్స్ సహా..!
Nothing Phone 3 Smartphone : నథింగ్ సంస్థ 2025 జులై నెలలో నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నథింగ్ తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా తీసుకొచ్చింది. నథింగ్ గత మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనేక డిజైన్ మార్పులను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఎందుకంటే ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
భారత్ మార్కెట్‌లో విడుదల సమయంలో ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89999 గా ఉండేది. గతంలో కొన్ని సేల్స్ సందర్భాల్లో కొన్నిరోజులపాటు ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో అనేక మంది ఆర్డర్లు క్యాన్సిల్ అయినట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేశారు.

ఏకంగా రూ.30 వేల డిస్కౌంట్ :
అయితే ప్రస్తుతం ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా రూ.30000 తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో 12GB/256GB వేరియంట్ ధర రూ.59999 గా ఉంది. 16GB/512GB వేరియంట్ ధర రూ.69999 గా ఉంది.
అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.20000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు ICICI, HDFC, యాక్సెస్ బ్యాంకు కార్డులపై అదనంగా రూ.10000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే మొత్తంగా రూ.30,000 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

1.5K అమోలెడ్ డిస్‌ప్లే :
నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో గ్లిఫ్ మిర్రర్, డిజిటల్ క్లాక్, స్టాప్ వాచ్, బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.5 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
నాలుగు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50MP కెమెరా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 6, వైఫై 7, A-GPS, NaVlc, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








