2012 లండన్ ఒలంపిక్స్‌కి మొబైల్ పేమంట్స్..

By Super
|
Samsung Visa
ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి గేమ్స్ ఒలంపిక్స్. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ ఒలంపిక్స్ 2012లో లండన్ ఆధిత్యం ఇవ్వనుంది. ఇందుకొసం ఇప్పుటినుండే లండన్ మాహా నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. అక్కడికి వచ్చేటటువంటి అతిధులు, కస్టమర్స్ కొసం విసాయూరప్, శ్యామ్‌సంగ్ రెండు సంయుక్తంగా ఆశ్చర్యంలో ముంచెత్తనున్నాయి. ఇందుకొసం ఈ రెండింటి భాగస్వామ్యంతో ఒలంపిక్స్‌కి సంబంధించిన సమాచారం కొసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్‌ని తయారు చేయనున్నాయి.

ఈ మొబైల్ ఫోన్స్‌ వల్ల ఉపయోగం ఏమిటంటే ఇందులో నిక్షిప్తం చేసిన ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీ సహాయంతో యూజర్స్ మొబైల్ పేమంట్స్‌ని చెల్లించవచ్చు. లండన్‌లో ఉన్న మొబైల్ ఆపరేటర్స్‌తో విసాయూరప్ ఇప్పటికే సంప్రదింపులను పూర్తి చేయడం జరిగిందన్నారు. దీనిని ఎప్పుడైతే విడుదల చేయడం జరుగుతుందో అప్పటి నుండి యూజర్స్ వారియొక్క పేమంట్స్ అన్నింటిని కూడా ఈ మొబైల్ ద్వారా చెల్లించవచ్చు. ఈ అప్లికేషన్ ఈ మొబైల్‌లో నిక్షిప్తం చేసిన నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్‌కి అనుసంధానంగా పనిచేస్తుందన్నారు.

2012 ప్రధమార్దంలోనే లండన్ ఆపరేటర్స్‌ని సంప్రదించి ఈ మొబైల్‌ని యూజర్స్‌కు అందుబాటులోకి తేవడం జరుగుతుందని విసాయూరప్ వెల్లడించింది. 2102 ఒలంపిక్స్ వచ్చిన యూజర్స్, అతిధిలను దృష్టిలో పెట్టుకోని ఈ అప్లికేషన్‌ని తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్ సహాయంతో యూజర్స్ వారియొక్క పేమంట్స్ అన్నింటిని పిన్ నెంబర్ ఆధారంగా సెక్యూరిటీ ద్వారా చెల్లించవచ్చు. విసాయూరప్ హెడ్ సాంద్రా ఆల్ జట్టా ఈ సందర్బంలో మాట్లాడుతూ ఈ డివైజ్‌లో రన్ అయ్యేందుకు శ్యామ్ సంగ్ కంపెనీకి చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ బడా లేదా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ లను రెండింటిని సంప్రదిస్తున్నామని తెలియజేశారు.

విసా రూపొందించిన ఈ అప్లికేషన్‌ని ప్రస్తుతం ఈఎమ్‌ఈఎ రీజియన్‌లో ఉన్న బ్యాంక్స్‌లలో వాడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ అప్లికేషన్‌ని నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ నిక్షిప్తం ఉన్న ఐఫోన్స్‌లతో విసా యూరప్ లండన్ ఉద్యోగులు టెస్టింగ్ చేస్తున్నారని సాంద్రా తెలియజేసింది. ఆ తర్వాత బ్యాంకులతో సంప్రదించి వాటికి సంబంధించిన పని పూర్తి చేసి 2012 ప్రధమార్దంలో ఈ అప్లికేషన్‌ని లండన్‌లో విడుదల చేయనున్నామని తెలిపారు.

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేని మొబైల్ ఫోన్స్‌లలో వీసాయూరప్ అందించేటటువంటి మైక్రో ఎస్‌డి ఎన్‌ఎఫ్‌సి కార్డ్స్ ఇనిస్టాల్ చేయవచ్చని తెలిపారు. ఇలా చేయడం వల్ల యూజర్స్ వారి మొబైల్స్ నుండి డైరెక్టుగా మొబైల్ పేమెంట్ సర్వీస్‌ని ఉపయోగించుకొవచ్చు. శ్యామ్‌సంగ్ గనుక బడా ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఈ డివైజెస్‌లో ఇనిస్టాల్ చేసినట్లైతే, వీటిని ప్రముఖ సెలబ్రిటీ, సాకర్ స్టార్ డేవిడ్ బెకహాం ఒలంపిక్స్ అయ్యేంతవరకు ఉపయోగించునున్నాడని సమాచారం.

ఇలా డేవిడ్ బెకహాం‌కి ఈ డివైజ్ ఇవ్వడం ప్రమోషన్‌లో భాగంగా అభివర్ణిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వీసాయూరప్, శ్యామ్‌సంగ్ 2012 లండన్ ఒలంపిక్స్‌లో మంచి పేరు సంపాదించుకొవడమే కాకుండా, మొబైల్ పేమంట్ సర్వీస్‌ని అందించిన సంస్దలుగా మిగిలిపోతాయని వారి అభిప్రాయంగా వెలిబుచ్చారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X