వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్, వరుసగా 3 రోజులు..

Written By:

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారీ ఆఫర్లకు తెరలేపింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వివో కార్నివాల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. డిసెంబర్ 20 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వివో పలు ఫోన్లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నది.

భారీగా తగ్గిన Galaxy Note 8 ధర

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్

అసలు ధర రూ. 18,990
తగ్గింపు రూ. 3000
ఇప్పటి ధర రూ. 15,990
వివో వీ5ఎస్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x1280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫన్‌టచ్ 3.0 ఓఎస్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 1.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ప్లాష్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో ఫ్లాష్, సెల్ఫీస్, వీడియో కాలింగ్), 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో), కంపాస్ మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఫోన్ బరువు 154 గ్రాములు. కొలత 153.80 x 75.50 x 7.55 మిల్లీ మీటర్లు.

వివో వీ5 ప్లస్

అసలు ధర రూ. 25,990
తగ్గింపు రూ. 6000
ఇప్పటి ధర రూ. 19,990
వివో వీ 5 ప్లస్ స్పెసిఫికేషన్స్
5.5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో 1080 పిక్సల్ తో వచ్చింది. 2.5 కర్వ్డ్ గ్లాస్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అదనపు ఆకర్షణగా నిలవనుంది.వివో వీ 5 ప్లస్ 4జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంటర్నల్ స్టోరేజి విషయానికొస్తే 64 జిబి ఆన్ బోర్డ్ స్టోరేజి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ చిప్ సెట్ ని ఇందులో పొందుపరిచారు.కెమెరా విషయానికొస్తే డ్యూయెల్ సెల్పీ కెమెరాతో ఫోన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఒకటి 8 ఎంపీ మరొకటి 20 ఎంపీ Sony IMX376 1/2.78-inch sensor సెల్పీ కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది. 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 3,160 mAh బ్యాటరీ. ఇది వివో డ్యూయెల్ ఛార్జింగ్ ఇంజిన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది.ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో వంటివి అదనపు ఫీచర్లు. దీని అమ్మకాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది.

వివో వై66

అసలు ధర రూ. 14,990
తగ్గింపు రూ. 2000
ఇప్పటి ధర రూ. 12,990
వివో వై66 ప్రత్యేకతలు..
మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల హైడిఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టం, , 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్.

వివో వై53

అసలు ధర రూ. 9,990
తగ్గింపు రూ. 1000
ఇప్పటి ధర రూ. 8,990

వివో వై 55ఎస్

అసలు ధర రూ. 13,490
తగ్గింపు రూ. 1500
ఇప్పటి ధర రూ. 11,990

క్యాష్ బ్యాక్

ఈ సేల్‌లో భాగంగా వివో ఫోన్లను కొంటే అమెజాన్ పేలో క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు బుక్ మై షో వోచర్లను కూడా అందిస్తున్నారు.

 

v

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo Carnival is now live on Amazon India: Top deals on V7, V5s and more mobiles More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot