Home
Mobile

రూ. 45 వేల స్మార్ట్‌ఫోన్, రూ.1947కే సొంతం చేసుకోండి

చైనా మొబైల్ దిగ్గజం వివో ఆగస్ట్ 15 వేడుకలకు రెడీ అయింది. వినియోగదారులకు ఆగస్టు 15 కానుకగా బంపరాఫర్లను ప్రకటించనుంది.

By Hazarath Aiah

చైనా మొబైల్ దిగ్గజం వివో ఆగస్ట్ 15 వేడుకలకు రెడీ అయింది. వినియోగదారులకు ఆగస్టు 15 కానుకగా బంపరాఫర్లను ప్రకటించనుంది. ఈ దిగ్గజం ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఫ్రీడం కార్నివాల్ పేరిట వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రత్యేక సేల్‌ను నిర్వహించనున్నది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు వివో ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ సేల్‌లో భాగంగా వివో ఫోన్లు, యాక్ససరీలపై డిస్కౌంట్లు, కూపన్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఆఫర్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

NEX and V9 ఫోన్లకు..

NEX and V9 ఫోన్లకు..

వివో ఈ మధ్య లాంచ్ చేసిన NEX and V9 ఫోన్లకు ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. ఈ ఫ్లాష్ సేల్ లో భాగంగా ఈ ఫోన్లను రూ. 1947కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్

ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్

అలాగే వివో కంపెనీకి సంబంధించిన యాక్ససరీలను కేవలం రూ.72 కే కొనవచ్చు. వీటికి గాను సేల్ జరిగే మూడు రోజులలో ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సేల్‌లో ముందు చెప్పిన తగ్గింపు ధరకే ఆయా ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్‌

రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్‌

దీంతో పాటు ఎంపిక చేసిన పలు రకాల వివో ఫోన్లపై రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారు. అన్ని రకాల వివో స్మార్ట్‌ఫోన్లపై 12 నెలల కాలవ్యవధితో కూడిన నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.

రూ.1200 విలువైన బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌

రూ.1200 విలువైన బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌

దీంతో పాటుగా వివో నెక్స్, ఎక్స్21, వి9 స్మార్ట్‌ఫోన్లను కొన్నవారికి రూ.1200 విలువైన బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా ఇస్తారు. వీటితో పాటు పలు రకాల ఫోన్లపై కూపన్ కోడ్‌లను అందించనున్నారు.

కూపన్ కోడ్

కూపన్ కోడ్

వివో ఇయర్ పోన్లు, యూఎస్‌బీ కేబుల్స్ కొంటే రూ.50 కూపన్ కోడ్ ఇస్తారు. వివో ప్రీమియం ఇయర్‌ఫోన్లపై రూ.200 కూపన్ కోడ్, వివో వి7 ఫోన్ కొంటే రూ.2వేల కూపన్ కోడ్, వి7 ప్లస్ ఫోన్ కొంటే రూ.3వేల కూపన్ కోడ్ ఇస్తారు. వీటిని వివో స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేసేందుకు రిడీమ్ చేసుకోవచ్చు.

 6వ తేదీ అర్థరాత్రి నుంచి

6వ తేదీ అర్థరాత్రి నుంచి

ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి వివో ఫ్రీడం కార్నివాల్ సేల్ ప్రారంభమవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Freedom Carnival from August 7 to 9: NEX and V9 at Rs. 1947 via flash sale, discounts, no-cost EMI and cashback More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X