6జీబీ ర్యామ్ తో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన Vivo V11 Pro

By Anil
|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 సంవత్సరం అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఏడాది టాప్ కంపెనీల బెజిల్ లెస్ స్మార్ట్ ఫోన్లు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో మొబైల్ మార్కెట్లోకి దూసుకువచ్చాయి. అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను దూసుకొస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా యూజర్లకి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కొత్త స్మార్ట్ ఫోన్లతో రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ రోజు Vivo V11 Pro ని ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 12 నుంచి షురూ కానున్నాయి .

 

ఫీచర్లు ....

ఫీచర్లు ....

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

 

 

ధర...

ధర...

ఈ Vivo V11 Pro మొబైల్ ధరను రూ. 25,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్ యొక్క సేల్స్ సెప్టెంబర్ 12 నుంచి షురూ కానున్నాయి .

6.4 ఇంచ్ డిస్‌ప్లే....
 

6.4 ఇంచ్ డిస్‌ప్లే....

ఇందులో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2340 x 1080 గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్....

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్....

Snapdragon 660 CPUతో పాటు 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది . ఆండ్రాయిడ్ ఓరియతో పాటు లేటెస్ట్ అప్ డేట్ తో ఈ ఫోన్ యూజర్లను అలరించనుంది.

డ్యూయెల్ రేర్ కెమెరా.....

డ్యూయెల్ రేర్ కెమెరా.....

Vivo V 11 Pro డ్యూయెల్ రేర్ కెమెరాతో మార్కెట్లో లాంచ్ ఆయింది .2PD కెమెరా అనే సరికొత్త టెక్నాలజీని ఈ Vivo V 11 Pro లో ప్రవేశపెట్టారు . 12MP+5MP rear cameraతో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చు. అంతే కాకుండా సెట్టింగ్స్ అడ్జెటమెంట్లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. షార్ప్ నెస్, బ్రైట్ నెస్ విభాగంలో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు ధీటుగా తయారు చేయబడింది.

25 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ ....

25 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ ....

సెల్ఫీ కెమెరాలతో మార్కెట్లో టాప్ కంపెనీల ఫోన్లు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా ఈ ఫీచర్ మీద కొంచెం ఎక్కువగానే శ్రద్ధపెట్టింది. Vivo 11 pro 25 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరాలో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీడియోలు, సెల్ఫీ షూట్లు ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దుకునే విధంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేసారు .

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్....

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్....

వివో తీసుకువచ్చిన ఫోన్లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ . ఈ ఫీచర్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారీ మీరు ఫోన్ అన్ లాక్ అలాగే ఫోటోలు లాంటి వాటిని చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది.

 

 

Best Mobiles in India

English summary
vivo launches V11 Pro in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X