హైఎండ్ స్మార్ట్‌ఫోన్లకు సవాల్ విసురుతున్న వివో నెక్స్
చైనా దిగ్గజం వివో అత్యంత ఖరీదైన హెఎండ్ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. వివో నెక్స్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులోకి వచ్చింది.
చైనా దిగ్గజం వివో అత్యంత ఖరీదైన హెఎండ్ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. వివో నెక్స్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులోకి వచ్చింది. రానున్న కాలంలో వివో సంచలనాలకు ఈ ఫోన్ కేంద్ర బిందువుగా మారి సరికొత్త ట్రెండ్ సృష్టించే విధంగా తయారుకానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. బెజిల్ లెస్ డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.44,990గా నిర్ణయించింది. భవిష్యత్ డిస్‌ప్లే స్కానింగ్ టెక్నాలజీని ప్రోత్సాహించే విధంగా ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఉంది. గత నెల 21 నుంచి Amazon.in, Vivo's e-storeలలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అలాగే ఎంపిక చేసిన స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ హైలెట్ అనడానికి కొన్ని కారణాలు మీముందుచుతున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

వివో నెక్స్ ఫీచర్లు
6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

డిస్‌ప్లే
వివో నెక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 ఇంచుల భారీ అమోల్డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2160 x 1080pగా ఉంది. Ultra FullView Displayతో వినియోగదారులకు బెస్ట్ క్లాస్ మల్టీ మీడియా వ్యూయింగ్ అనుభూతిని అందించనుంది.

కెమెరా
ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పాపప్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. ఫోన్ డిస్‌ప్లే కింది భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. కాగా సెల్ఫీ కెమెరాలో కొన్ని హిడన్ ఫీచర్లను పొందుపరిచారు. దీని ద్వారా సెల్ఫీ తీసుకునే సమయంలో చాలా అందంగా ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది.

హార్డ్‌వేర్
Snapdragon 845 chipsetతో పాటు 8జిబి ర్యామ్ ,128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వినియోగదారులను అలరిస్తోంది. మెమొరీ ఎక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా గేమ్ ఆడుకోవచ్చు. గేమ్ యూజర్లకు ఈ ఫోన్ ఓ ప్రత్యేకమని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ విషయానికొస్తే 4,000 mAh battery బ్యాటరీని పొందుపరిచారు.

కొనుగోలు చేసే యూజర్లకు
కాగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు పలు ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.4వేల క్యాష్ బ్యాక్ ఇస్తారు.

రూ.5వేల వరకు అదనంగా డిస్కౌంట్
ఇతర ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.5వేల వరకు అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్‌కు గాను నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

జియో రూ.1950 క్యాష్‌బ్యాక్
రిలయన్స్ జియో రూ.1950 క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై అందిస్తున్నది. ఈ ఫోన్‌ను కొన్నవారికి వివో వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ లభిస్తుంది. అలాగే అష్యూర్డ్ బైబ్యాక్‌ను కూడా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications








