వివో నెక్స్‌పై భారీ తగ్గింపు, అమెజాన్‌లో మరిన్ని ఆఫర్లపై ఓ లుక్కేయండి
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వివో నెక్స్ పై భారీ తగ్గింపును అందించింది .ఈ ఫోన్ పై ఏకంగా రూ. 5 వేల తగ్గింపును అందిస్తోంది.
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వివో నెక్స్ పై భారీ తగ్గింపును అందించింది .ఈ ఫోన్ పై ఏకంగా రూ. 5 వేల తగ్గింపును అందిస్తోంది. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.44,900గా ఉంది. ఇప్పుడు రూ.39,990కే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ధర అమెజాన్లో కోట్ అయింది. దీంతో పాటు అమెజాన్లో ఇతర ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. మొత్తం మీద యూజర్లు ఈ ఫోన్ ఎక్సేంజ్ తో కొనుగోలు చేస్తే రూ. 21 వేల వరకు అదనపు ప్రయోజనాలను అందుకోవచ్చు. అలాగే స్ బ్యాంకు క్రెడిట్ కార్డు మీద 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే HDFC కార్డు హోల్డర్లకు 5 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.అలాగే బజాజ్ ఫిన్ సర్వ్ డిస్కౌంటు , Appario Retail Pvt Ltd ద్వారా కొనుగోలు చేస్తే తగ్గింపు వంటి ప్రయోజనాలు అందుాబాటులో ఉన్నాయి. ఫోన్ ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

వివో నెక్స్ ఫీచర్లు
6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వివో కార్నివాల్
దీంతో పాటు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో వివో కార్నివాల్‌ను ఈ నెల 4వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో వివో స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే 5 నుంచి 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

వివో వి9 ప్రొ
వివో వి9 ప్రొకు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ తగ్గింపు ధరతో రూ.17,990 ధరకే లభిస్తున్నది. అలాగే ఈ ఫోన్‌పై రూ.4వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

వివో వి8ఎల్ఐ, వై93, వై95, వై81
ఇక వివో వి11, వి11 ప్రొ ఫోన్లు రూ.20,990, రూ.25,990 ధరలకు లభ్యమవుతున్నాయి. దీనిపై రూ.5వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే వివో వి8ఎల్ఐ, వై93, వై95, వై81 ఫోన్లను కూడా తక్కువ ధరలకే ఈ సేల్‌లో అందిస్తున్నారు.

వివో నెక్స్ డ్యుయల్ డిస్‌ప్లే ఫోన్
ఇదిలా ఉంటే వివో నెక్స్ డ్యూయెల్ డిస్ ప్లే ఫోన్ అతి త్వరలో ఇండియాకి రానుంది. దీని ఫీచర్లను ఓ సారి గమనిస్తే ..
6.39 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5.49 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








