ఆకట్టుకునే ఫీచర్లతో Vivo Nex, జూలై 19న లాంచ్

|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 సంవత్సరం అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఏడాది టాప్ కంపెనీల బెజిల్ లెస్ స్మార్ట్ ఫోన్లు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో మొబైల్ మార్కెట్లోకి దూసుకువచ్చాయి. యూజర్ల చేతిలో ఫోన్ ఇట్టే ఇమిడిపోయిన ఈ ఫోన్లు వినియోగదారులకు అదిరిపోయే మల్టీ మీడియా అనుభవాన్ని అందిస్తున్నాయి. అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను దూసుకొస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా యూజర్లకి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కొత్త స్మార్ట్ ఫోన్లతో రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కంపెనీ Vivo Nexని లాంచ్ చేసింది. display fingerprint scanning technology ప్రధాన ఆకర్షణగా వచ్చిన ఈ ఫోన్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

 

ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న జియో ఇనిస్టిట్యూట్ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న జియో ఇనిస్టిట్యూట్

ఈ నెల 19వ తేదీన

ఈ నెల 19వ తేదీన

వివో స్మార్ట్‌ఫోన్లు Vivo Nex సీరిస్ ఫోన్లను గత నెలలో చైనాలో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్లను ఈ నెల 19వ తేదీన భారత్‌లో విడుదల చేయనుంది. రూ.41వేలు, రూ.47వేల ధరలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

Vivo Nex ఫీచర్లు

Vivo Nex ఫీచర్లు

6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ (నెక్స్ ఎ), 8 జీబీ ర్యామ్ (నెక్స్ ఎస్), 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎ), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

డైమండ్ బ్లాక్, రెడ్ కలర్స్‌లో
 

డైమండ్ బ్లాక్, రెడ్ కలర్స్‌లో

డైమండ్ బ్లాక్, రెడ్ కలర్స్‌లో 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. వివో నెక్స్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

అమోల్డ్ డిస్ ప్లే

అమోల్డ్ డిస్ ప్లే

స్క్రీన్ టు బాడీ రేషియో 91.24 శాతం ఉన్నందున ఫోన్ డిస్‌ప్లే పూర్తిగా అంచుల వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో పై భాగంలో డిస్‌ప్లే కింద మైక్రో స్లిట్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల దాంట్లో ఉండే 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా యూజర్ కావాలనుకున్నప్పుడు పైకి ఓపెన్ అవుతుంది. దాంతో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు.

సెల్ఫీ కెమెరా

సెల్ఫీ కెమెరా

సెల్ఫీ కెమెరాలతో మార్కెట్లో టాప్ కంపెనీల ఫోన్లు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా ఈ ఫీచర్ మీద కొంచెం ఎక్కువగానే శ్రద్ధపెట్టింది. వివో నెక్స్ లోని సెల్పీ కెమెరాలో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీడియోలు, సెల్ఫీ షూట్లు ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దుకునే విధంగా దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు.

In-display Fingerprint Scanner

In-display Fingerprint Scanner

వివో తీసుకువచ్చిన ఫోన్లో display fingerprint scanning technology ప్రధాన ఆకర్షణ నిలవనుంది. ఈ ఫీచర్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారీ మీరు ఫోన్ అన్ లాక్ అలాగే ఫోటోలు లాంటి వాటిని చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది.

డ్యూయెల్ రేర్ కెమెరా

డ్యూయెల్ రేర్ కెమెరా

Vivo NEX డ్యూయెల్ రేర్ కెమెరాతో వచ్చింది. 12MP+5MP rear cameraతో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చు. అంతే కాకుండా సెట్టింగ్స్ అడ్జెటమెంట్లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. షార్ప్ నెస్, బ్రైట్ నెస్ విభాగంలో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు ధీటుగా వచ్చింది.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్

Snapdragon 845 CPUతో పాటు 8జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వచ్చింది. ఆండ్రాయిడ్ ఓరియతో పాటు లేటెస్ట్ అప్ డేట్ తో ఈ ఫోన్ యూజర్లను అలరించనుంది.

Best Mobiles in India

English summary
Vivo Nex is all set to redefine the premium smartphone category in India more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X