రాబోయే Vivo ఫోల్డ‌బుల్ మొబైల్స్‌ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా!

|

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీలు ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ల‌పై దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు ద‌క్షిణ కొరియా టెక్‌ దిగ్గ‌జం samsung కంపెనీ సాంసంగ్ కంపెనీ samsung z fold 4 లాంచ్ కు రంగం సిద్దం చేసుకుంటుండ‌గా.. చైనాకు చెందిన వివో కంపెనీ కూడా ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్‌మెంట్‌లో కాస్త చురుకుగా దూసుకెళ్తోంది.

 
vivo fold

ఇప్ప‌టికే ఈ వివో కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో, ఏప్రిల్ నెలలో, Vivo తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా చైనా మార్కెట్లో విడుదల చేసింది. దానికి Vivo X ఫోల్డ్ అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు, కంపెనీ తన తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆ రాబోయే కొత్త ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌కు సంబంధించిన విష‌యాలు లీక‌య్యాయి. వాటి గురించి ఓ సారి మ‌నం కూడా తెలుసుకుందాం.

 

అల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌!
Vivo నుండి రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలు తెలియనప్పటికీ, టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి వచ్చిన కొత్త నివేదిక ఆ డివైజ్‌లోని ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి ఆస‌క్తిక‌ర వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఈ రాబోయే స్మార్ట్ ఫోన్ ఫోల్డబుల్ డిస్‌ప్లేపై డ్యూయల్ స్క్రీన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. మార్కెట్‌లోని ఇత‌ర పోటీ ఉత్పత్తులు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండటంతో ఇది ఆకట్టుకుంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

vivo fold

భ‌విష్య‌త్తులో వివో నుంచి రెండు ఫోల్డ‌బుల్ ఫోన్లు!
Vivo సమీప భవిష్యత్తులో రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్న‌ట్లు తెలుస్తోంది. ఒకటి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కు స‌క్సెస‌ర్ కాగా, మరొకటి నిలువు ఫ్లిప్ లేదా క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే విడుద‌లైన Vivo X ఫోల్డ్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 8.3 అంగుళాల E5 LTPO OLED 3.0 డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఇక రెండో స్క్రీన్ విషయానికొస్తే.. 6.53 అంగుళాల E5 OLED హెచ్‌డీ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేటుతో HDR10+ స‌పోర్టును క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 12GB of LPDDR5 RAM+256GB|512GB అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

vivo fold

ఈ మొబైల్ 4 కెమెరాల‌ సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.8, (wide) అప‌ర్చ‌ర్ లెన్స్ ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. మిగిలిన మూడు లెన్స్‌లు 48 మెగాపిక్సెల్‌లు, 12 మెగాపిక్సెల్‌లు, 8 మెగాపిక్సెల్‌లు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల f/2.5, (wide) అప‌ర్చ‌ర్ లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS / A-GPS / NavIC, NFC, USB టైప్-సి పోర్ట్‌ ఉంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,600 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు.

ఈ Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్ 11న చైనాలో విడుద‌లైంది. వివో ఎక్స్ ఫోల్డ్ ప్రారంభ ధర 8,999 చైనీస్ యువాన్లుగా నిర్ణ‌యించ‌బ‌డింది. భార‌త్‌లో 12GB RAM+256GB వేరియంట్ ధ‌ర దాదాపు రూ. 1,07,200 ఉండొచ్చు.

Best Mobiles in India

English summary
Vivo’s upcoming foldable smartphone to feature ultrasonic fingerprint sensor

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X