Vivo S1 Pro: ఆకర్షణీయమైన ధర వద్ద నేడే మొదటి సేల్ ప్రారంభం...

|

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీసంస్థ వివో 2020 క్యాలెండర్ సంవత్సరంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. వివో సంస్థ నుంచి 'ఎస్' సిరీస్‌లో వస్తున్న తదుపరి ఫోన్ "వివో ఎస్ 1 ప్రో" ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో డైమండ్ ఆకారంలో ఉన్న కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో కెమెరా శ్రేణి మధ్యలో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ లెన్స్‌తో ఉంటుంది.

వివో ఎస్ 1 ప్రో
 

వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అందరిని ఆకట్టుకునే స్పెసిఫికేషన్ లతో ప్యాక్ చేయబడి వస్తుంది. వివో యొక్క ఈ డిజైన్ ఫోన్ ప్రేక్షకులు ఆశించే అన్ని రకాల ఫీచర్లను కలిగి ఉంది. భారతీయ మార్కెట్లోకి వివో S1 స్మార్ట్‌ఫోన్‌ 2019 ఆగస్టులో విడుదల అయ్యి గొప్ప విజయాన్ని సాధించింది. ఇప్పుడు S- సిరీస్ పోర్ట్‌ఫోలియో క్రింద సంస్థ నుండి వస్తున్న రెండవ ఫోన్ వివో ఎస్ 1 ప్రో. దీని యొక్క ధర మరియు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL వసంతం ప్లాన్‌...తక్కువ ధర వద్ద అధిక ప్రయోజనాలు

ధరల వివరాలు

ధరల వివరాలు

వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు కేవలం ఒకే ఒక వేరియంట్‌లో రిలీజ్ చేసారు. అది 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్‌ గల వేరియంట్ యొక్క ధర రూ.19,990గా ఉంది. ఇది మిస్టిక్ బ్లాక్, జాజీ బ్లూ మరియు డ్రీమీ వైట్ అనే మూడు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు... తక్కువ ధర వద్ద అన్ లిమిటెడ్ డేటా!!!!!

లభ్యత

లభ్యత

వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క సేల్స్ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది వివో యొక్క అన్ని ఆఫ్‌లైన్‌లో మరియు వివో ఇండియా ఇ-స్టోర్ వంటి ఆన్‌లైన్ ఛానెల్‌లు మరియు అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర అన్ని ప్రధాన ఇ-ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.

జనవరి 2020 సెక్యూరిటీ అప్‌డేట్‌ను పొందిన గెలాక్సీ Aసీరీస్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆఫర్‌లు
 

ఆఫర్‌లు

వివో ఎస్ 1 ప్రోను కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కంపెనీ కొన్ని లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. అలాగే కొత్త S1Pro కొనుగోలుపై వినియోగదారులకు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఛానెల్‌లలో అనేక ఆఫర్‌లు లభిస్తాయి.

ఆఫ్‌లైన్‌ ఆఫర్స్

*** ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుపై 10 శాతం క్యాష్‌బ్యాక్

*** వన్ టైమ్ స్క్రీన్ రిప్లేసెమెంట్

ఆన్‌లైన్ ఆఫర్స్

*** వన్ టైమ్ స్క్రీన్ రిప్లేసెమెంట్ జనవరి 31 వరకు చెల్లుతుంది

*** ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇఎంఐపై 10 శాతం క్యాష్‌బ్యాక్

*** 12000 విలువైన జియో ఆఫర్లు జనవరి 31 వరకు చెల్లుతాయి

*** 9 నెలల వరకు నో-కాస్ట్ EMI

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లో 6.39-అంగుళాల ఫుల్ హెచ్‌డి + సూపర్ అమోలెడ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్క్రీన్-టు-బాడీ 19.5: 9 కారక నిష్పత్తితో ఉండి వాటర్ డ్రాప్ నాచ్ 90 శాతంగా ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పైతో ఫన్‌టచ్ ఓఎస్ 9.2 తో రన్ అవుతుంది.

శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్....

కెమెరా

ఈ కొత్త ఫోన్ యొక్క వెనుక వైపు డైమండ్ ఆకారపు మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లెన్స్ ఉంటుంది. దీనితో పాటు వరుసగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు మాక్రో షాట్స్ మరియు పోర్ట్రెయిట్ షాట్ల కోసం రెండు 2 మెగాపిక్సెల్ లెన్సులు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్‌ 18W డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో జతచేసిన 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo S1 Pro Launched in India: Check Price, Availability, Offers, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X