Vivo T1 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటు ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో
చైనీస్ టెక్ దిగ్గజం వివో నేడు భారతదేశంలో వివో T1 5G స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. వివో టెక్ దిగ్గజం పోర్ట్‌ఫోలియోలో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 8GB RAM మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్-HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం చైనాలో ప్రారంభించబడింది. అయితే దీని స్పెసిఫికేషన్‌లు భారతీయ వేరియంట్‌కు భిన్నంగా ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు విపులంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vivo T1 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు
భారతదేశంలో వివో T1 5G స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.15,990 కాగా 6GB ర్యామ్ + 128GB మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధరలు వరుసగా రూ.16,990 మరియు రూ.19,990. వివో కొత్త స్మార్ట్‌ఫోన్ రెయిన్‌బో ఫాంటసీ మరియు స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 14 నుండి అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా మొదటిసారి విక్రయించనున్నది. వివో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయ పరిమిత వ్యవధి ఆఫర్‌లో భాగంగా HDFC బ్యాంక్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులకు రూ.1000 తక్షణ తగ్గింపుతో అందిస్తుంది.

Vivo T1 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
వివో T1 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత FunTouch OS 12తో రన్ అవుతుంది. ఇది 6.58-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. హుడ్ కింద వివో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCని కలిగి ఉంది మరియు గరిష్టంగా 8GB RAMతో జత చేయబడింది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే వివో T1 5G ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/2.4 ఎపర్చర్‌తో రెండు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌లను పొందుతుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందుభాగంలో f/2.0 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. 6GB మరియు 8GB RAM వేరియంట్‌లు సూపర్ నైట్ మోడ్‌తో పాటు మల్టీ స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్‌ను పొందుతాయి.

Vivo T1 5G ఫోన్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, USB టైప్-C మరియు USB OTG ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, వర్చువల్ గైరోస్కోప్ సెన్సార్, GPS, బీడౌ, గ్లోనాస్, గెలీలియో మరియు QZSS ఉంటాయి. వివో స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Vivo T1 5G కొలతలు 164x75.84x8.25mm మరియు బరువు 187గ్రాములు.


Click it and Unblock the Notifications