50MP కెమెరాతో Vivo T1X స్మార్ట్‌ఫోన్ భార‌త్‌లో విడుద‌ల.. ఓ లుక్కేయండి!

|

Vivo కంపెనీ స‌రికొత్త మోడ‌ల్ మొబైల్‌ను భార‌త మార్కెట్ కు ప‌రిచ‌యం చేసింది. Vivo T1X పేరుతో బ‌డ్జెట్ సెగ్మెంట్‌ మొబైల్‌ను కంపెనీ బుధ‌వారం భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ కొత్త మోడ‌ల్ మొబైల్ వాట‌ర్ డ్రాప్ స్టైల్‌ నాచ్ డిస్‌ప్లేతో వ‌స్తోంది. దీనికి 50 మెగాపిక్సెల్ క్వాలిటీతో ఇస్తున్న ప్రైమ‌రీ లెన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. అంతేకాకుండా, బ్యాట‌రీ 5000mAh సామ‌ర్థ్యంతో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ తొలుత ఏప్రిల్ నెల‌లో మ‌లేషియాలో ఆవిష్క‌రించారు. గ‌త అక్టోబ‌ర్‌లో చైనాలో ఇదే మోడ‌ల్ మొబైల్ MediaTek Dimensity 900 SoC ప్రాసెస‌ర్‌తో విడుద‌లైంది. ఇక భార‌త్‌లో విడుద‌లైన ఈ Vivo T1X మోడ‌ల్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు గురించి చ‌ర్చించుకుందాం.

 
50MP కెమెరాతో Vivo T1X స్మార్ట్‌ఫోన్ భార‌త్‌లో విడుద‌ల.. ఓ లుక్కేయండి!

Vivo T1X ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.58 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఇది octa-core 6nm Qualcomm Snapdragon 680 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 2.5D క‌ర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్ష‌న్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ IP67 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 12 బేస్‌డ్‌ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారం తో ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా 4GB, 8GB రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. ఇక ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ విష‌యానికి వ‌స్తే 128 జీబీ వ‌ర‌కు స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు.

ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీ లో ప్రైమ‌రీ లెన్స్‌, మ‌రొక‌టి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ లో సెకండ్ లెన్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. వైఫై, బ్లూటూత్ వ‌ర్ష‌న్ 5.0, ఎఫ్ఎం రేడియో ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

50MP కెమెరాతో Vivo T1X స్మార్ట్‌ఫోన్ భార‌త్‌లో విడుద‌ల.. ఓ లుక్కేయండి!

భార‌త మార్కెట్లో దీని ధ‌ర‌:
భార‌త్‌లో మార్కెట్లో ఈ మొబైల్ 4GB RAM + 64GB వేరియంట్ ధ‌ర రూ.11,999 గా నిర్ణ‌యించారు. ఇక 4GB RAM + 128GB ధ‌ర రూ.12,999 గా ఉంది. ఇక టాప్ మోడ‌ల్ వేరియంట్ 6GB RAM + 128GB ధ‌ర రూ.14,999 గా నిర్ణ‌యించారు. ఈ మొబైల్స్ గ్రావిటీ బ్లాక్‌, స్పేస్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఇవి జులై 27 వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు యూజ‌ర్లు ఈ మొబైల్ కొనుగోలు పై రూ.1000 త‌క్ష‌ణ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

50MP కెమెరాతో Vivo T1X స్మార్ట్‌ఫోన్ భార‌త్‌లో విడుద‌ల.. ఓ లుక్కేయండి!

వివో నుంచి ఫ్లాగ్‌షిప్ సెగ్‌మెంట్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్ vivo x80 pro. ఇప్పుడు ఆ vivo x80 pro స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల గురించి తెలుసుకుందాం.
ఈ మొబైల్ కు 6.78 అంగుళాల క్వాడ్‌ HD+ E5 AMOLED LTPO పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Dimensity 9000 4nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ|512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 50MP + 48MP + 12MP + 8MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. ఈ డివైజ్ (IP68) వాట‌ర్ రెసిస్టెంట్ టెక్నాల‌జీని క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.79,999 ధ‌ర‌కు కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Vivo T1x With 5,000mAh Battery, 50-Megapixel Dual Rear Cameras Launched In India: Price, Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X