Home
Mobile

8GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!

వివో T3 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మార్చి 21వ తేదీన ఇటీవల లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం విడుదల అయిన వివో T2 5G ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా విడుదల అయింది. ఈ ఫోన్ సేల్‌ (Vivo T3 5G Smartphone Sale) తాజాగా ప్రారంభం అయింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

వివో T3 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ రూ.19,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. వివో అధికారిక వెబ్‌ సైట్ మరియు ఫ్లిప్‌ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కాస్మిక్‌ బ్లూ మరియు క్రిస్టల్‌ ఫ్లేక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 5G Smartphone Sale

వివో T3 5G స్మార్ట్‌ఫోన్ ను HDFC బ్యాంకు మరియు SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. లేదా ఎక్స్చేంజీ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు 3 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలు పొందవచ్చు. దీంతోపాటు మార్చి 31వ తేదీ వరకు వివో వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.599 విలువైన వివో XE710 ఇయర్‌ఫోన్స్‌ ను పొందవచ్చు.

వివో T3 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో T3 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్ మరియు 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌ నెస్‌లో విడుదల అయింది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS :
ఈ వివో T3 5G స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటి 7200 SoC చిప్‌ సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది.

50MP సోనీ కెమెరా :
ఈ వివో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP డెప్త్‌ సెన్సా్ర్‌ మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం పంచ్‌ హోల్‌ డిజైన్‌లో 16MP సెన్సార్‌ను అమర్చారు. మరియు ఈ ఫోన్ 44W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ వివో కొత్త హ్యాండ్‌ సెట్‌ 5G, 4G VoLTE, వైఫై 6, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మరియు భద్రత కోసం ఈ హ్యాండ్‌ సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T3 5G Smartphone Sale is live on flipkart here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X