ధర రూ.9999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ Vivo 5G స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!
వివో నుంచి ప్రస్తుతం ఎంట్రీ లెవల్, బడ్జెట్ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అయితే వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T3 Lite 5G Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ధర, ఆఫర్లు :
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధరలు వరుసగా రూ.10,499, రూ.11499 గా ఉంది. అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రెండు కలర్ వేరియంట్‌లు :
ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. ఈ వివో స్మార్ట్‌ఫోన్ మెజిస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
వివో T3 లైట్ 5G హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల (1612*720 పిక్సల్స్) HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీప్రెష్ రేట్, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 269 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది.
వివో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 4GB LPDDR4X ర్యామ్ మరియు 128GB eMMC 5.1 తో జతచేసింది. 6GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. దీంతోపాటు LED ఫ్లా్ష్ లైట్‌ను కలిగి ఉంది. నైట్, పొర్ట్రెయిట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
* వివో నుంచి ఈ నెల 17 వ తేదీన వివో V50 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుంది. ZEISS ఆధారిత 50MP OIS ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. సర్కిల్ టూ సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్సిలేషన్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్‌లు వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








