Home
Mobile

ధర రూ.12000 కంటే తక్కువ ధరలో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు..??

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో మరో 5G హ్యాండ్‌ సెట్‌ విడుదల కానుంది. వివో T3 సిరీస్‌ విస్తరణలో భాగంగా వివో T3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Vivo T3 Lite 5G Smartphone) లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని సమాచారం. రూ.12000 కంటే తక్కువ ధరకే లభిస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్‌ కు సంబంధించి 91మొబైల్స్‌ కీలక వివరాలను వెల్లడించింది.

ఈ నివేదిక ఆధారంగా వివో T3 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ జూన్ నెలాఖరు నాటికి భారత్ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే విడుదల తేదీపై ఎటువంటి కచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి కొన్ని వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి.

Vivo T3 Lite 5G Smartphone may launch in india in june end here are the specifications

దీని ఆధారంగా వివో T3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 50MP సోనీ AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) ఆధారిత కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మరిన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. వివో T3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌.. వివో T3 తరహా కొన్ని స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

వివో T3 5G స్మార్ట్‌ఫోన్‌ 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్ మరియు 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటి 7200 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ను కలిగి ఉంది. మరియు 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.

ఈ వివో T3 స్మార్ట్‌ఫోన్ 44W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న వివో T3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T3 Lite 5G Smartphone may launch in india in june end here are the specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X