ధర రూ.10499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఫీచర్‌లు, సేల్ పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో ఇవాళ T సిరీస్ హ్యాండ్‌సెట్ విడుదల అయింది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T3 Lite 5G Smartphone Launched) భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో వివో T3x 5G, వివో T3 5G ఉన్నాయి. అయితే T3 లైట్ 5G ఫోన్ తక్కువ ధరలోనే IP64 రేటింగ్‌తో లాంచ్ అయింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీ పైన పనిచేయనుంది.
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీప్రెష్ రేట్, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 269 ppi పిక్సల్ డెన్సిటీతో అందుబాటులోకి వచ్చింది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంది.
ఈ వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. దీంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 4GB LPDDR4X ర్యామ్ మరియు 128GB eMMC 5.1 తో జతచేయబడుతుంది.

మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6GB వరకు వర్చువల్ గా ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఈ వివో కొత్త హ్యాండ్‌సెట్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులో వచ్చింది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.10499, 6GB ర్యామ్ ధర రూ.11499 గా ఉంది. జులై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. వైబ్రెంట్ గ్రీన్, మెజిస్టిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
సేల్‌లో భాగంగా తొలి రోజు HDFC బ్యాంకు, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.299 విలువ చేసే 10W ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. సేల్ ప్రారంభం అయిన రోజు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications