రూ.9999 కే 128GB స్టోరేజీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. పూర్తి వివరాలు..!
వివో నుంచి గత వారం వివో T3 లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ తాజాగా (Vivo T3 Lite 5G Smartphone sale) ప్రారంభం అయింది. వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా బేస్ వేరియంట్‌ను బ్యాంకు ఆఫర్లతో రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు.
వివో T3 లైట్ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499, అదే 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో.. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రిడెట్ కార్డు, HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.9999 గా ఉందనుంది. ఈ హ్యాండ్‌సెట్ మెజిస్టిక్ బ్లాక్, వైబ్రెంట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4GB LPDDR4X ర్యామ్ మరియు 128GB eMMC 5.1 తో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. 6GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకోవచ్చు
వివో T3 లైట్ 5G హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 90Hz రీప్రెష్ రేట్, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 269 ppi పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. f/1.8 అపేచర్‌తో 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. మరియు 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంది.
ఈ వివో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై, 5G, 4G LTE, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








