Home
Mobile

భారత్‌లో రేపు విడుదల కానున్న వివో 5G స్మార్ట్‌ఫోన్‌.. రూ.12000 కంటే తక్కువ ధర..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ నుంచి ఇటీవల Y58 5G స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. రేపు (జూన్‌ 27వ తేదీ) మరో 5G స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్ కానుంది. ఇప్పటికే దీనిపై వివో ప్రకటన చేసింది. వివో T3 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ (Vivo T3 Lite 5G) భారత్‌లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు సహా కలర్‌ వేరియంట్ల వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.12,000 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది.

వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఇటీవల లీకైన వివరాల ఆధారంగా వివో T3 లైట్ 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.65 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌, మెరుగైన బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Vivo T3 Lite 5G Smartphone

దీంతోపాటు ఈ వివో కొత్త 5G స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉండే అవకాశం ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ వివో T3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సోనీ కెమెరాలను కలిగి ఉంటుంది. వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX852 AI కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు పొర్ట్రెయిట్‌ ఫొటోగ్రఫీ కోసం 2MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా రానుంది. దీంతోపాటు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటుంది. పైన తెలిపిన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు కొన్నింటిపై వివో సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

వివో T3 లైట్ 5G స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.12,000 కంటే తక్కువ ఉంటుందని సమాచారం. దీంతోపాటు ఈ వివో ఫోన్‌ మెజిస్టిక్‌ బ్లాక్‌ మరియు వైబ్రంట్‌ గ్రీన్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T3 Lite 5G Smartphone to launch in india on tomorrow with sony camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X