Home
Mobile

50MP AI కెమెరా సహా ఆకట్టుకొనే డిజైన్‌తో vivo 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి.. బడ్జెట్ ధరలో..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి నిన్న (జూన్‌ 20) న వివో Y58 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. అయితే వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివో సంస్థ ప్రకటన చేసింది. భారత్‌ మార్కెట్‌లో వివో T సిరీస్‌ హ్యాండ్‌సెట్‌ల విస్తరణలో భాగంగా వివో T3 లైట్‌ స్మార్ట్‌ఫోన్ (Vivo T3 Lite Smartphone Launch Date) వచ్చే వారం భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 27న భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని సంస్థ తెలిపింది.

రెండు రంగుల్లో లభిస్తుంది :
వివో T3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫోటోను సంస్థ షేర్‌ చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ స్లాబ్‌ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఫ్లాట్‌ స్క్రీన్‌తో రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G సపోర్టుతో రెండు రంగుల్లో లభిస్తుంది. గ్రీన్‌ మరియు బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Lite Smartphone

50MP AI కెమెరా :
దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ దీర్ఘచతురస్రాకార (Rectangular) కెమెరా మాడ్యుల్‌తో డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే కొన్ని లీక్‌ల ఆధారంగా 50MP AI ప్రధాన కెమెరా సహా 2MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌లో :
వివో T3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వివో కొత్త ఫోన్‌ ధర రూ.12,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Lite Smartphone

నిన్ననే భారత్ మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ :
భారత్‌ మార్కెట్‌లో జూన్‌ 20న వివో 6.72 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లేతో ఫోన్ విడుదల అయింది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. 4nm ఆక్టాకోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు Adreno 613 GPU తో జతచేయబడి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 50MP ప్రధాన కెమెరా మరియు 44W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,499 గా ఉంది. ప్రస్తుతం వివో ఈ-స్టోర్‌ సహా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T3 Lite Smartphone launch date confirmed in india with 50MP AI Camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X