5500mAh బ్యాటరీ, కర్వడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా Vivo 5G ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్..!
వివో గత సంవత్సరం మిడ్ రేంజ్‌లో వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ డిజైన్ సహా స్పెసిఫికేషన్‌ల పరంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కర్వడ్ డిస్‌ప్లేతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. మరియు బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
భారత్ మార్కెట్‌లో వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్ల ధరలు రూ.24,999, రూ.26,999 గా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB ర్యామ్ వేరియంట్ ధర రూ.22999, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది.

దీంతోపాటు (Vivo T3 Pro 5G Smartphone price drop) అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ప్రారంభ ధర రూ.20999 గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ప్రాసెసర్ వివరాలు :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ Adreno 720 HPU, 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని వివో హామీ ఇచ్చింది.
డిస్‌ప్లే :
డిజైన్ పరంగా శాండ్‌స్టోన్ కలర్ వేరియంట్ వేగాన్ లెదర్ ఫినిష్, ఎమరాల్డ్ గ్రీన్ మ్యాటీ ఫినిష్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6.67 అంగుళాల ఫుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.
5500mAh భారీ బ్యాటరీ :
ఈ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్ రక్షణను పొందుతుంది. మరియు వెట్ టచ్ టెక్నాలజీ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ వివో హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ర్టానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. AI Photo Enhance, AI Erase వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కాంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే సెన్సార్ అమర్చారు.


Click it and Unblock the Notifications








