Home
Mobile

5500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌ 5G ఫోన్‌పై రూ.3500 డిస్కౌంట్‌..!

వివో ఇటీవల కాలంలో భారత్‌ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. వివో V50, V50e, వివో T4x 5G, వివో T4 5G ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇప్పటికే మిడ్‌రేంజ్‌లో అనేక బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను వివో కలిగి ఉంది. గత సంవత్సరం లాంచ్ అయిన వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Vivo T3 Pro 5G Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 5500mAh బ్యాటరీతోపాటు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ ధరలు విడుదల సమయంలో రూ.24999, రూ.26999 గా ఉండేది. ఇటీవలే ఈ ఫోన్‌ ధరను రూ.2000 చొప్పున వివో సంస్థ తగ్గించింది. దీంతోపాటు ఈ ధరలు రూ.22999, రూ.24999 గా ఉన్నాయి.

vivo T3 Pro 5G smartphone gets rs3500 price discount

అయితే తాజాగా వివో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌పై గరిష్ఠంగా రూ.3500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. HDFC, ICICI బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్‌ ఎమరాల్డ్ గ్రీన్‌, శాండ్‌స్టోన్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

వివో T3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఈ డిస్‌ప్లే 6.67 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2000Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. Schott Xensation గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ Adreno 720 HPU, 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. మరియు 2 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

వివో ప్రో మోడల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరాను అమర్చారు. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ర్టానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టు కలిగి ఉంటుంది.

ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా విభాగం AI Erase, AI Photo Enhance వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ శాండ్‌స్టోన్‌ కలర్‌ వేరియంట్‌ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌, ఎమరార్డ్‌ గ్రీన్‌ మ్యాటీ ఫినిష్‌తో అందుబాటులో వచ్చింది. మరియు ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ టెక్నాలజీ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగించుకోచ్చు.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi, బ్లూటూత్‌ 5.4, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, గైరోస్కోప్‌, యాక్సెలిరోమీటర్‌, ఇ-కాంపాస్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఇన్‌డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T3 Pro 5G smartphone gets rs3500 price discount in india here is the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X