5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్.. ఈ కార్డులపై రూ.3000 తగ్గింపు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో తాజాగా భారత్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో T3 ప్రో 5G (Vivo T3 Pro 5G Smartphone launched) పేరుతో ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ రూ.20,000 ధర రేంజ్‌లో లాంచ్ చేసింది. ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ సేల్ తేదీలను కూడా వెల్లడించింది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2000Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్ రక్షణను కలిగి ఉంటుంది.

ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. Adreno 720 HPU, 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందనుంది.
ఈ హ్యాండ్‌సెట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమింగ్ మోడ్, సిక్స్ మోషన్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు Wet Touch టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. వెనుకవైపు లెదర్ ఫినిష్, గ్లోసీ గోల్డ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ AI Photo Enhance మరియు AI Erase వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
కెమెరా విభాగం పరంగా ఈ వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభించనుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను HDFC బ్యాంక్, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








