Home
Mobile

సూపర్‌ డీల్‌.. 50MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీ కలిగిన Vivo 5G ఫోన్‌లపై రూ.2000 తగ్గింపు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సీజన్‌ సందర్భంగా వివో T3 ప్రో 5G, వివో T3 అల్ట్రా 5G ఫోన్‌లపై రూ.2000 చొప్పున ధరలను తగ్గించింది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫాంలలో ప్రత్యేక సేల్‌లో భాగంగా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో T3 అల్ట్రా 5G, T3 ప్రో ఫోన్‌లు 5500mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉన్నాయి. వివో ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ఈ తగ్గింపు ధరలకు ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

విడుదల సమయంలో వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్‌లపై రూ.2000 చొప్పున తగ్గింది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.22,999 గా ఉండనుంది.

Vivo T3 Ultra 5G and T3 Pro 5g smartphones price slashed by RS2000

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ప్రస్తుతం వివో రూ.2000 ధరను తగ్గించింది. ఫలితంగా ఫోన్‌ను రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు.

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T3 Ultra 5G) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 తో పనిచేస్తుంది.

Vivo T3 Ultra 5G and T3 Pro 5g smartphones price slashed by RS2000

వివో T3 అల్ట్రా 5G హ్యాండ్‌సెట్ 50MP సోనీIMX921 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను అమర్చి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు Aura Ring Light తో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌ AI Photo Enhance, AI Eraser వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌లను కలిగి ఉంది.

Vivo T3 Ultra 5G and T3 Pro 5g smartphones price slashed by RS2000

వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ ఫోన్‌ (Vivo T3 Pro 5G) 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌. 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2000Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది.

వివో హ్యాండ్‌సెట్‌ OIS, EIS ఫీచర్‌లతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ సహా 16MP సెల్ఫీ కెమెరా అమర్చి ఉంది. AI Photo Enhance, AI Erase, అల్ట్రా గేమింగ్‌, మోషన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T3 Ultra 5G and T3 Pro 5g smartphones price slashed by RS2000 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X