Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌..!

వివో నుంచి గత నెలలో T3 అల్ట్రా మోడల్‌ (Vivo T3 Ultra 5G Smartphone Sale) భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. గత నెలలోనే సేల్‌ ప్రారంభం అయింది. ప్రస్తుతం పండుగ సీజన్‌ సందర్భంగా వివో ఇండియా డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు నోకాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ బ్యాంకు కార్డులతో : ఈ సేల్‌ లో భాగంగా HDFC, ICICI, SBI బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

Vivo T3 Ultra 5G Smartphone

ఆఫర్‌ అనంతరం ధరలు : ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.3000 డిస్కౌంట్‌ అనంతరం స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.28,999 గా ఉంది. మిగిలిన వేరియంట్‌లు రూ.30,999, రూ.32999 గా ఉన్నాయి. లూనార్‌ గ్రే, ఫ్రాస్ట్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. పండుగ సీజన్ వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల (2800*1260 పిక్సల్స్‌) 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది.

5500mAh బ్యాటరీ :
వివో T3 అల్ట్రా హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX921 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. Aura Ring Light ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. AI Eraser, AI Photo Enhance వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ లను కలిగి ఉంది.

IP68 రేటింగ్‌తో : కనెక్టివిటీ పరంగా వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌లను కలిగి ఉంది. గైరోస్కోప్‌ సెన్సార్‌, యాంబియంట్ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌ లను కలిగి ఉంటుంది. IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T3 Ultra 5G Smartphone gets RS3000 discount during Diwali offer 2024 full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X