Home
Mobile

5500mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా, 6.78 అంగుళాల 3D కర్వడ్‌ డిస్‌ప్లే Vivo 5G ఫోన్‌పై రూ.5000 తగ్గింపు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో ఈ సంవత్సరం భారత్ మార్కెట్‌లో అనేక ఫోన్‌లు లాంచ్‌ చేసింది. ఇందులో వివో V50, V50e స్మార్ట్‌ఫోన్‌లతోపాటు వివో T4 5G, T4x 5G ఫోన్‌లు ఉన్నాయి. అయితే గత సంవత్సరం వివో నుంచి విడుదల అయిన వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే వివో సంస్థ ఈ ఫోన్‌ పై రూ.2000 ధర తగ్గించింది. అయితే ప్రస్తుతం మరింత డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

భారత్‌ మార్కెట్‌లో వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T3 Ultra 5G Smartphone Price Drop on Flipkart) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్‌ను పొందచ్చు.

vivo T3 Ultra 5G Smartphone gets Rs5000 price drop on flipkart

అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.33999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.28999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.35999 కు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30999 కే కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ఆఫర్‌లతోపాటు అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంటే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్రాస్ట్‌ గ్రీన్‌, లూనార్‌ గ్రే వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

vivo T3 Ultra 5G Smartphone gets Rs5000 price drop on flipkart

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వివో హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 480Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

వివో హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం G715 GPU చిప్‌సెట్‌ కూడా అమర్చారు. ఈ స్మా్‌ర్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోని IMX921 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు Aura Ring లైట్ ను కూడా కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌, ఆటోఫోకస్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. AI Photo Enhance, AI Eraser వంటి AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్‌లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
vivo T3 Ultra 5G Smartphone gets Rs5000 price drop on flipkart here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X