50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల 3D కర్వడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ రెండో సేల్ తేదీ వెల్లడి!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవల వివో T3 అల్ట్రా హ్యాండ్‌సెట్‌ను (Vivo T3 Ultra 5G Smartphone sale) లాంచ్ చేసింది. సెప్టెంబర్ 19 వ తేదీ తొలి సేల్ నిర్వహించారు. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా సేల్ నిర్వహించారు. సెప్టెంబర్ 26 నుంచి వివో T3 అల్ట్రా మోడల్ రెండో సేల్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సేల్ జరగనుంది. ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP సెల్ఫీ కెమెరా, IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ తొలి సేల్ సెప్టెంబర్ 19 న నిర్వహించారు. సెప్టెంబర్ 26 నుంచి రెండో సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్ల ద్వారా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ వివో అల్ట్రా మోడల్ హ్యాండ్‌సెట్ లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2800*1260 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంది.
వివో T3 అల్ట్రా హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీ జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. AI Eraser, AI Photo Enhance ఫీచర్లతో ఫోన్ నుంచే ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు.
కెమెరా విభాగం పరంగా వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను అమర్చారు. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ వెనుకవైపు Aura Ring Light ను అమర్చి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, GPS, USB-C ఛార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉంది. టెంపరేచర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, యాంబియంట్ సెన్సార్, యాక్సిలిరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








