Home
Mobile

వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. 50MP సెల్ఫీ కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే సహా..!!

వివో నుంచి ఇటీవల T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేతోపాటు 5500mAh బ్యాటరీతోతో పనిచేస్తుంది. మరియు 50MP సెల్ఫీ కెమెరా సహా IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా లాంచ్‌ అయింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ తొలిసేల్ నిర్వహించగా.. ఇవాళ్టి నుంచి రెండో సేల్‌ (Vivo T3 Ultra 5G Smartphone Sale on Flipkart) ప్రారంభం అయింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. లూనార్‌ గ్రే, ఫ్రాస్ట్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. HDFC, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపును పొందవచ్చు.

Vivo T3 Ultra 5G Smartphone sale

వివో T3 అల్ట్రా హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల (2800*1260 పిక్సల్స్‌) 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ వివో హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది.

Vivo T3 Ultra 5G Smartphone sale

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వివో స్మార్ట్‌ఫోన్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాల అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు Aura Ring Light ను అమర్చి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. AI Eraser, AI Photo Enhance ఫీచర్లతో ఫోన్‌ నుంచే ఫోటోలను ఎడిట్‌ చేసుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌లను కలిగి ఉంది. యాంబియంట్ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, గైరోస్కోప్‌ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T3 Ultra 5G Smartphone second sale is live on flipkart specs features price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X